మనం రోజూ ఒకటి రెండు సార్లు స్నానం చేస్తాం.. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఒకసారైనా స్నానం చేయడం అలవాటు. కానీ ఒకటి కాదు రెండు ఏళ్ల తరబడి స్నానం చేయకుండా ఉండడం సాధ్యమేనా? 67 ఏళ్ళ నుంచి స్నానం చేయని హాజీ గురించి మీకు తెలుసా. ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి (DIrty Man) హాజీ. రికార్డుల కెక్కిన హాజీ కన్నుమూశాడని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: Gopuff Layoff: గోపఫ్.. 200 మందికి పైగా స్టాఫ్ ఉఫ్
67 ఏళ్ల నుంచి అసలు స్నానమే చేయని హాజీ కొద్ది నెలల క్రితం తొలిసారి స్నానం చేశాడట. అయితే, స్నానం చేసిన కొద్ది నెలలకే హాజీ చనిపోవడం జరిగింది. అనారోగ్యానికి గురవుతాననే భయంతోనే ఆయన ఇన్ని ఏళ్ళు స్నానం చేయలేదంటున్నారు. స్నానం చేశాక ఇలా చనిపోవడం ఏంటని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇన్నేళ్ళు స్నానమే చేయకుండా ఎలా వుండగలిగాడనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

Read Also: T20 World Cup: స్టోయినిస్ తాండవం.. శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం