Pakistan: పాకిస్తాన్‌లో మహిళల పరిస్థితి ఇది.. మహిళా దినోత్సవం రోజున ర్యాలీకి అనుమతి నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Day March Banned In Lahore: తెల్లారిలేస్తే భారత్ లోని కాశ్మీర్ ప్రజల హక్కుల గురించి గగ్గోలు పెడుతుంది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మైనారిటీలను అణిచివేస్తోందంటూ పలు అంతర్జాతీయ వేదికపైనే మొసలి కన్నీరు కారుస్తుంటుంది. కానీ తన సొంత దేశంలోని మైనారిటీల పరిస్థితులను పట్టించుకోదు. ప్రతీ ఏటా హిందూ, సిక్కు అమ్మాయిలను మతం మార్చి, కిడ్నాపులు చేసి ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నారు. దైవదూషణ పేరుతో అమాయకులను చంపేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఏటా కొన్ని వందల మందిని పాక్ సైన్యం ఊచకోత కోస్తుంది. అయినా కూడా వీటి గురించి పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోవు. ఎప్పుడూ ఇండియాను దోషిగా నిలబెట్టేందుకే అభివృద్ధి చెందాం అని చెప్పుకునే వెస్ట్రన్ దేశాలు భారత్ పై అసత్య ఆరోపణలు చేస్తుంటాయి.
Read Also: Vada pav: “వడాపావ్”కు అరుదైన గుర్తింపు.. బెస్ట్ శాండ్‌విచ్‌ల జాబితాలో చోటు..
Also Read
- Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్‌గా బాస్‌కి చెప్పేస్తుంది!
- Khawaja Asif: ఆ విషయంలో భారత్‌పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
- Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్‌గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లో మార్చి8న నిర్వహించ తలపెట్టిన ‘ఔరత్ ర్యాలీ’(మహిళా ర్యాలీ)కి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భద్రతాపరమైన సమస్యలు, వివాదాస్పద బ్యానర్లు, పోస్టర్లను చూపి అనుమతి ఇవ్వడం లేదని చెప్పింది.
ఇదిలా ఉంటే ఇస్లామిక్ విలువల పరిరక్షణ కోసం పిలుపునిచ్చే ‘‘హయా ర్యాలీ’’కి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మహిళలు ఇది తమ హక్కులనను ఉల్లంఘించడమే అని ర్యాలీ నిర్వహకురాలు హిబా అక్బర్ అంటున్నారు. ఔరత్ మార్చ్ ను నిషేధించిన ప్రభుత్వం, హయా ర్యాలీకి ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. విడాకులు, లైంగిక వేధింపులు, రుతుక్రమం వంటి అంశాలపై బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా ఔరత్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకులు పాశ్చాత్చ, ఉదారవాద విలువను ప్రోత్సహిస్తున్నారని, మతం, సంస్కృతి గౌరవించడం లేదని ఆరోపించారు. హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాహోర్ నిర్ణయాన్ని ఖండించింది. మరోవైపు ఇస్లామాబాద్ లో జరిగే ఔరత్ మార్చ్ ను ఓ పార్క్ ప్రాంతంలోకి మార్చారు. ఫిబ్రవరిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ర్యాలీని సిటీ పార్కుకు మార్చింది అక్కడి ప్రభుత్వం.
తాజావార్తలు
-
West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
-
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!