Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Who Was Dipu Chandra Das Hindu Man Lynched In Bangladesh Over Blasphemy Allegations

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ ఎవరు?

Published Date :December 20, 2025 , 3:33 pm
By Venu Goapl Reddy
  • మరోసారి ఉద్రిక్తంగా బంగ్లాదేశ్..
  • హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ దారుణహత్య..
  • తప్పుడు ఆరోపణలు చేసి పొట్టనపెట్టుకున్న మతోన్మాద మూక..
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ ఎవరు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh Violence: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. అక్కడి రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు అరాచకాలకు పాల్పడ్డారు. మైమెన్‌సింగ్ నగరంలో గురువారం రాత్రి మత దూషణ ఆరోపణల నేపథ్యంలో ఒక మూక దాడిలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. 25 ఏళ్ల దాస్, మైమన్‌సింగ్ నగరంలో నివసిస్తున్నాడు. అక్కడ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ, జీవనోపాధి పొందుతున్నాడు. నగరంలోని స్క్వర్ మాస్టర్‌బారి ప్రాంతంలోని పయనీర్ నిటి కాంపోజిట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.

అయితే, స్థానిక సాక్షుల కథనం ప్రకారం, దైవదూషణ ఆరోపణలు ఫ్యాక్టరీ ప్రాంగంణంలో, చుట్టపక్కల ప్రాంతాల్లో వేగంగా వ్యాపించడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆ తర్వాత ఒక గుంపు దాస్‌పై తీవ్రంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. భలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (దర్యాప్తు) అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ.. హత్య తర్వాత, గుంపు మృతదేహాన్ని ఢాకా-మైమెన్‌సింగ్ హైవే పక్కన పడేసి నిప్పంటించిందని, దీంతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయిందని తెలిపారు.

Read Also: Pawan Kalyan: విభజన తర్వాత పదేళ్లు నలిగిపోయాం.. తెలుగు జాతి కోసం కూటమిగా ఏకమయ్యాం..

ఈ ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటనను ఖండిస్తున్నట్లు యూనస్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. న్యూ బంగ్లాదేశ్‌లో హింసకు తావులేదని, నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పింది. ఈ దాడికి పాల్పడిన వారిలో ఏడుగురిని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను మహ్మద్ లిమోన్ సర్కార్ (19), మహ్మద్ తారెక్ హుస్సేన్ (19), మహ్మద్ మణిక్ మియా (20), ఎర్షాద్ అలీ, నిజుమ్ ఉద్దీన్, అలోమ్‌గిర్ హుస్సేన్ (38) ,మహ్మద్ మీరాజ్ హుస్సేన్ అకోన్ (46)గా గుర్తించారు.

అయితే, వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం ఈ ఘటనపై మాట్లాడారు. దీపు చంద్ర దాస్‌పై మత దూషణ ఆరోపణలు తప్పుగా మోపారని అన్నారు. ఒక ముస్లిం సహోద్యోగి ఒక చిన్న విషయంపై దీపును శిక్షించాలని, తప్పుడు ఆరోపణలు చేయడంతో అతడిని మూకదాడిలో చంపేశారని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh lynching
  • Bangladesh mob violence
  • bangladesh unrest
  • Bangladesh violence
  • blasphemy allegation

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions