Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా యూకే వీసా, ఉద్యోగ మోసాల ఆరోపణలతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ తెలుగు యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ (రమ నందన) కుటుంబానికి యూకే న్యాయస్థానంలో భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. తమపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ యూకే కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రకటిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. వీసా స్పాన్సర్షిప్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారంటూ ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు కావడం, సెప్టెంబర్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు నందనను ఆపడం వంటి పరిణామాలతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. టీవీ చర్చలు, యూట్యూబ్ వేదికలపై విస్తృతమైన ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరిగిన తర్వాత నందూ కుటుంబం మొదటిసారి న్యాయపరమైన విజయంపై స్పందించింది.
“హెడ్లైన్లు తీర్పులు కావు, కేవలం ఆరోపణలు చేసినంత మాత్రాన అవి రుజువులు అయిపోవు. ప్రజాభిప్రాయం ఎప్పటికీ చట్టానికి ప్రత్యామ్నాయం కాలేదు.” తీవ్రమైన వ్యతిరేకత, టీవీ ముఖాముఖులు, బహిరంగ ఆరోపణలు ఎదురైనప్పటికీ తాము సహనంతో న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచామని ఆమె పేర్కొన్నారు. “ఊహాగానాలను పక్కనపెట్టి, న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే మాట్లాడనిద్దాం” అంటూ మీడియా విచారణను (Media Trial) ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 2026 అక్టోబర్ 15 తమ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజని, సత్యమే గెలిచిందని నందన తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. అయితే, ఈ ప్రకటన యూకే కోర్టు పరిధిలోని వ్యవహారానికి సంబంధించినదా లేక స్వదేశంలో నమోదైన కేసులపై కూడా ప్రభావం చూపుతుందా అనే దానిపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నందూ కుటుంబం తమ పోరాటంలో నిలబడిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ, గౌరవంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసింది.
Also Read
తాజావార్తలు
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
-
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
-
Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!