White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
- నేనే ఏసుక్రీస్తు అవతారం..
- వైట్ హౌజ్ కాల్పుల నిందితుడు..
- గతంలో రెండుసార్లు అరెస్ట్..
- తాజా ఘటనలో అధికారుల కాల్పుల్లో హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. మరణించిన నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. అయితే, ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, తానే ‘‘ఏసుక్రీస్తు అవతారం’’ అని నమ్మేవాడని తెలిసింది.
గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌజ్ వద్ద హంగామా సృష్టించిన నేరాల కింద రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అధ్యక్ష భవనం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటం వల్ల తరుచుగా అధికారులు ఇతడిని గమనించేవారని నివేదికలు చెబుతున్నాయి. అరెస్ట్ సమయంలో తానే ఏసు క్రీస్తు అవతారమని, కావాలనే పోలీసులకు చిక్కానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైట్ హౌజ్ పరిసరాల్లోకి రావద్దని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ వాటిని అతను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.
Also Read
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
మే 24న వైట్ హౌజ్ వెలుపల ఉన్న 17 స్ట్రీట్ నార్త్ వెస్ట్ ప్రాంతంలో నసీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. దీని తర్వాత అతను తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అధికారులు జరిపిన కాల్పుల్లో నసీర్ బెస్ట్ మరణించాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ చెప్పారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?