Pakistan PM: భారత్ పై యుద్ధంలో మేం గెలిచాం..
- గత మూడు రోజులుగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత..
- భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించాం..
- పాక్ ను ఎవరైనా సవాల్ చేస్తే విడిచి పెట్టే ప్రసక్తే లేదు: షెహబజ్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan PM: గత మూడు రోజులుగా జరిగిన భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం నాటికి తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక, కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకు అయినా వెనుదిరిగేది లేదన్నారు. పాకిస్తాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.
Read Also: Cease Fire Violation : అమృత్‌సర్‌లో కొనసాగుతున్న హైఅలర్ట్.. ప్రజలకు ప్రభుత్వ కీలక సూచనలు!
Also Read
అయితే, భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, క్షిపణులతో దాడులు చేసిందని.. అనేక మంది సాధారణ పౌరుల చావుకు కారణమైందని ప్రధాని షెహబజ్ షరీఫ్ మండిపడ్డారు. పాకిస్తాన్ పై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుంది.. భారత్ కు తగిన బుద్ధి చెప్పాం.. తమ జోలికి వస్తే తాము ఏం చేయగలమో చేసి చూపించాం.. భారత్ పై యుద్ధంలో పాక్ విజయం సాధించిందని షెహబజ్ షరీఫ్ పేర్కొన్నారు.
Read Also: Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!
కాగా, ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని 3 గంటలైనా గడవక ముందే మరోసారి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు, కాల్పులతో విరుచుకుపడి తన వక్ర బుద్ధిని బయట పెట్టింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో దాడులు జరుగుతుండటంతో బ్లాకౌట్ విధించారు ఇండియన్ ఆర్మీ అధికారులు.
తాజావార్తలు
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
-
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్?
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!