Site icon NTV Telugu

Iran War: ఈరోజు ఇరాన్‌కు ‘‘కాళరాత్రే’’.. అమెరికా వార్నింగ్..

Usa

Usa

Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై ఇప్పటి వరకు జరగని విధంగా భారీ, అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా తన ఫైటర్ జెట్స్, బాంబర్స్, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులతో ఇరాన్‌ను టార్గెట్ చేసుకుంటుందని ప్రకటించారు. గత 24 గంటల్లో ఇరాన్ అతి తక్కువ క్షిపణుల్ని ప్రయోగించిందని, ఇది వారి సైనిక శక్తి క్షీణిస్తోందనడానికి సంకేతమని పేర్కొన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పటి కన్నా మరింత ఖచ్చితంగా పనిచేస్తోందని, దాడులు మరింతగా పెరుగుతాయని చెప్పారు.

Read Also: Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!

ఇరాన్ నౌకాదళాన్ని బలహీనం చేయడం, అణు సదుపాయాలను ధ్వంసం చేయడం, క్షిపణి నిల్వలు, లాంచర్లనున నాశనం చేయడం, రక్షణ వ్యసస్థనను దెబ్బతీయడం అమెరికా ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయని వెల్లడించారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలు పొందకుండా చేయడం అమెరికా ప్రధాన లక్ష్యం అని చెప్పారు.

ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని అడ్డుకుంటే, చమురు సరఫరా ఆపడానికి ప్రయత్నిస్తే, ఇప్పటి వరకు జరిగిన దాడుల కన్నా 20 రెట్ల ఎక్కువ శక్తితో ప్రతిస్పందిస్తామని చెప్పారు. మరోవైపు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక శక్తిని క్రమంగా తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. ఇరాన్ 6000 ఏళ్ల పురాతన నాగరికత ఉందని, దానికి ఎవరూ నాశనం చేయలేరని చెప్పారు.

Exit mobile version