Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Reports Monkeypox Case In Texas Resident

అమెరికాలో మరో వైరస్‌ కలకలం.. మంకీపాక్స్‌ కేసు వెలుగులోకి..

Published Date :July 17, 2021 , 4:56 pm
By Sudhakar Ravula
అమెరికాలో మరో వైరస్‌ కలకలం.. మంకీపాక్స్‌ కేసు వెలుగులోకి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోన్న సమయంలోనే.. కరోనా కొత్త వేరియంట్లతో పాటు మరికొన్ని కొత్త వైర్‌లు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరో వైరస్‌ కలకలం సృష్టిస్తోంది.. టెక్సాస్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మంకీపాక్స్‌ వైరస్‌ కేసు వెలుగుచూసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి అక్కడే మంకీపాక్స్‌ వైరస్‌ సోకి ఉంటుందని పేర్కొంది.. ప్రస్తుతం డల్లాస్‌లోని ఓ ఆసుపత్రిలో బాధితుడిని ఐసొలేషన్‌లో ఉంచారు..

మంకీపాక్స్ వైరస్‌ ఎక్కువ శాతం జంతువులు, ఎలుకలు ఉంటుంది.. కొన్ని సార్లు జంతువుల నుంచి మానవులకు కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది.. ఇక, మంకీపాక్స్‌ వైరస్‌ బాధితుడు కొన్ని రోజుల క్రితం నైజీరియా నుండి అమెరికాకు వచ్చాడు.. ఈ నెల 8,9 తేదీల్లో ఆ వ్యక్తి ప్రయాణించిన రెండు విమానాల్లో అతడితో కలిసి ఉన్న ఇతర ప్రయాణికులను ట్రేస్‌ చేసి వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఎయిర్‌లైన్స్‌, స్థానిక ఆరోగ్య సంస్థలతో కలిసి ప్రయత్నిస్తున్నట్లు సీడీసీ పేర్కొంది. ప్రస్తుతం ఒక వ్యక్తికే మంకీపాక్స్ సోకినందున సాధారణ ప్రజలకు ఎలాంటి వ్యాప్తి ముప్పులేదని తెలిపింది. 2003లో అమెరికాలో 47 మందికి మంకీపాక్స్‌ సోకినట్లు వెల్లడించింది సీడీఎస్‌. ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం మంకీపాక్స్ మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన వైరస్‌..ఈ వైరస్ ఎక్కువగా కోతులు, ఎలుకల్లో ఉంటుంది. చాలా రేర్‌‌గా మనుషులుకు సోకే ప్రమాదం ఉంటుంది. మశూచి కంటే దీని వైరల్ ఇన్ఫెక్షన్ లెవల్ సీరియస్‌గా ఉంటుంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో మొదట జలుబు, ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయి. ఆ తర్వాత లింఫ్‌ నోడ్స్ వాపు రావడం, ముఖంతో పాటు శరీరం అంతా దద్దులు వస్తాయి అని చెబుతున్నారు… రెండు నుంచి నాలుగు వారాల్లోనే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుందని కూడా వెల్లడించారు అధికారులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CDC
  • Centers for Disease Control and Prevention
  • Dallas
  • monkeypox
  • Nigeria

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions