Bird Flu Virus: కోవిడ్-19 చేసిన కల్లోల్లాన్ని ప్రపంచం అంతా చూసింది. కరోనా వైరస్ తన రూపాలను మార్చుకుంటూ ప్రజల్ని వణికించింది. లక్షల్లో మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరో ‘‘మహమ్మారి’’ కూడా వచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా, అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని ఒక వ్యక్తిని H5N5 బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సోకింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ రోగికి సోకిన వైరస్‌ను ఇంతకుముందు ఎప్పుడూ కూడా మనుషుల్లో గుర్తించలేదు. దీంతో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు.
Read Also: Bihar Politics: సీఎంగా నితీష్ కుమార్, 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం..?
9 నెలల్లో అమెరికా వ్యాప్తంగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఉంది. అయితే, ఇది తొలిసారిగా మానవుడిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ప్రస్తుతం రోగికి బర్డ్ ఫ్లూ వైరస్ ఉండటంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైరస్ ఎలా సోకిందో పరిశోధకులు ఖచ్చితంగా చెప్పలేదు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా సోకిన జంతువుల లాలా జలం, శ్లేష్మ, మలం, పాడి పశువుల పాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా అటవీ పక్షలుల్లో ఈ ఏమియన్ ఇన్‌ఫ్లూయెంజా చాలా కాలంగా ఉంది. జనవరి 2022లో అమెరికాలో దీని వ్యాప్తి ప్రారంభమైంది. చాలా పశువులు, పక్షులు ఈ ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నాయి.
అయితే, ఇప్పటి వరకు మానవుడి నుంచి మానవుడికి వ్యాపించినట్లుగా ఎక్కడా జరగలేదు. జంతువులు, పక్షుల నుంచి మానవుల్లో సోకే వైరస్‌గా మారడం అంత తేలికైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు, కానీ ఇలా మార్పు చెందే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి సమయంలో 70 మానవ కేసుల్ని గుర్తించారు. జనవరిలో ఒక వృద్ధుడైన రోగి మరణించాడు. చాలా కేసులు తేలికపాటివి, కళ్ళు ఎర్రబడటం లేదా జ్వరం వంటి లక్షణాలతో ఉన్నాయి, అయితే కొంతమంది వ్యక్తులు మరింత తీవ్రమైన అనారోగ్యాన్ని అనుభవించారు. సోకిన వారిలో ఎక్కువ మంది జంతువులకు ప్రత్యక్షంగా కాంటాక్ట్ లో ఉన్నవారే.