Bird Flu Virus: కోవిడ్-19 చేసిన కల్లోల్లాన్ని ప్రపంచం అంతా చూసింది. కరోనా వైరస్ తన రూపాలను మార్చుకుంటూ ప్రజల్ని వణికించింది. లక్షల్లో మరణాలు సంభవించాయి.
2025లో భారతదేశంలో ప్రధానంగా 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వ్యాప్తి జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘెల్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పులి, సింహం, చిరుతపులి, పెంపుడు పిల్లులు వంటి పక్షులేతర జాతులలోనూ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని నిర్ధారించారు.