Ali Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియలపై షాకింగ్ రిపోర్ట్.. అమెరికా భయంతో 13 దేశాలు దూరం!
- ఖమేనీ అంత్యక్రియల్లో అగ్రరాజ్యం మైండ్ గేమ్
- అమెరికా దెబ్బకు వెనక్కి తగ్గిన 13 దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali Khamenei Funeral: ఇరాన్ మాజీ సర్వోన్నత నేత (సుప్రీం లీడర్) అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అంతర్జాతీయ దౌత్య రాజకీయం తీవ్ర సంచలనంగా మారింది. అమెరికా తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడంతో.. కనీసం 13 దేశాలు ఖమేనీ అంతిమ వీడ్కోలు వేడుకలకు దూరం జరిగాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నీమ్’ ఒక సంచలన కథనంలో వెల్లడించింది. తేహ్రాన్ నడిబొడ్డున ఉన్న ‘ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లా’లో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
సీక్రెట్ ఆదేశాలు జారీ చేసిన మార్కో రుబియో
తస్నీమ్ నివేదిక ప్రకారం.. జూన్ 26న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు (ఎంబసీలు), దౌత్య మిషన్లకు అత్యంత రహస్య ఆదేశాలు జారీ చేశారు. ఖమేనీ అంత్యక్రియలకు ఏ దేశమైనా హాజరైతే, దానిని అమెరికా శతృత్వ చర్యగా పరిగణిస్తుందని.. ఆయా దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించాల్సిందిగా రుబియో ఆదేశించినట్లు ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ అంత్యక్రియలకు హాజరైతే ఆయా దేశాలకు అమెరికా ఇచ్చే అభివృద్ధి నిధులను (డెవలప్మెంట్ ఎయిడ్) కట్ చేస్తామని అమెరికా రాయబారులు హెచ్చరించినట్లు సమాచారం. దీనితో పాటు ఐదు అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో మార్కో రుబియో స్వయంగా ఫోన్లలో మాట్లాడి ఒత్తిడి తెచ్చినట్లు తస్నీమ్ వెల్లడించింది.
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
వెనక్కి తగ్గిన ఆ 13 దేశాలు ఇవే..
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ఐరోపాకు చెందిన 3 దేశాలు, ఆఫ్రికాకు చెందిన 5 దేశాలు, పర్షియన్ గల్ఫ్‌కు చెందిన 2 అరబ్ దేశాలు, తూర్పు ఆసియాకు చెందిన 2 పెద్ద దేశాలు ఇరాన్ పర్యటనలను రద్దు చేసుకున్నాయని తస్నీమ్ నివేదిక వెల్లడించింది. అయితే భద్రతా, దౌత్య కారణాల దృష్ట్యా ఆ దేశాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. కొన్ని దేశాలు తాము రాలేకపోతున్నామనే సమాచారాన్ని జెనీవా, న్యూయార్క్ దౌత్య మిషన్ల ద్వారా ఇరాన్‌కు చేరవేయగా.. మరికొన్ని దేశాలు చిన్న స్థాయి అధికారులను పంపే ప్రయత్నం చేశాయి. కానీ ఇరాన్ అధికారులు ఆ తక్కువ స్థాయి ప్రతినిధులను అనుమతించేందుకు నిరాకరించారు.
ముగిసిన చివరి ప్రార్థనలు..
ఆదివారం తేహ్రాన్‌లో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు సభ్యులకు అంతిమ ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. శనివారం నుంచే ఖమేనీ పార్థివ దేహాన్ని ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచగా, లక్షలాది మంది ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ నుంచి ఆయనకు ప్రాణహాని తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా కారణాల వల్ల ముజ్తబా ఖమేనీ తన తండ్రి అంతిమ వీడ్కోలు కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ‘అల్ జజీరా’ నివేదించింది.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!