US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన కుటుంబం మృతి
- అమెరికాలో ఘోరం
- అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన కుటుంబం మృతి
- రక్షించేలోపే ఊపిరాడక దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓహియో రాష్ట్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఖేడా జిల్లాకు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషానీగా గుర్తించారు. రెండేళ్ల క్రితం కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓహియో రాష్ట్రంలోని వూస్టర్ నగరంలో ఉన్న ఎకానో లాడ్జ్ (Econo Lodge) మోటెల్లో హితేష్‌భాయ్ ఉద్యోగం చేస్తున్నారు. అదే మోటెల్లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో మోటెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే మోటెల్ రిసెప్షన్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. బాత్రూమ్లో నీటి ట్యాప్‌లు తెరిచి అక్కడే ఉండాలని సిబ్బంది సూచించినట్లు సమాచారం. దీంతో హితేష్‌భాయ్, ఆయన భార్య, కుమార్తె బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అయితే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టడంతో బాత్రూమ్లోనే పొగతో ఊపిరాడక ముగ్గురూ మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అమెరికా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక సమాచారం అందుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!