ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌…!!

యూపీ, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ తేదీ వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌గ‌ర‌బోతున్నాయి.  ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సీఈసీ ప్ర‌క‌టించింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన ఐదు రాష్ట్రాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు.  షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌డంతో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.  జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు ఎలాంటి పాద‌యాత్ర‌లు, ర్యాలీలు చేసేందుకు వీలు లేద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొన్న‌ది. అదే విధంగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు నిషేధం విధించింది.  అయితే, ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించింది.   విజ‌యోత్స‌వ ర్యాలీల‌ను ర‌ద్దు చేసింది.  గెలిచిన అభ్య‌ర్థి వెంట ఇద్ద‌రు మాత్ర‌మే ఉండాల‌ని అదేశించింది.  క‌రోనా థ‌ర్డ్ వేవ్ దృష్ట్యా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలియ‌జేసింది.  

Read: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..

అయితే, ఇండియాలో ఇప్ప‌టికే థ‌ర్డ్‌వేవ్ మొద‌లైంది.  థ‌ర్డ్ వేవ్ ప్రారంభంలోనే రోజుకు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 మ‌ధ్య థ‌ర్డ్ వేవ్ పీక్స్‌లో ఉంటుందని ఐఐటి మ‌ద్రాస్ నిపుణుల స‌ర్వేలో తేలింది.  న్యూఇయ‌ర్ వేడుక‌ల‌ను అనుమ‌తులు ఇవ్వ‌డంతోనే కేసులు భారీగా పెరుగుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నాయి.  ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రిలీజ్ అయ్యాక అభ్య‌ర్థులు ప్ర‌చారం చేసుకోవాల్సి ఉంటుంది.  ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం లేకుండా ఉండ‌దు.  ఎన్నిక‌ల కార‌ణంగా దేశంలో క‌రోనా కేసులు మరింత‌గా పెరుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నాయి.  ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని నిపుణులు చెబుతున్నారు.  ఆర్ వ్యాల్యూ ఇప్ప‌టికే దేశంలో 4 గా ఉన్న‌ది.  ఇది మరింత పెరిగితే డేంజ‌ర్ అని నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.  

Related Articles

Latest Articles