US-Iran War: ఇరాన్‌పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు
- ఇరాన్‌పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడి
- పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబును అమెరికా పేల్చింది. ఇరాన్‌లోని ప్రధాన నగరమైన ఇస్ఫహాన్‌లోని ముఖ్యమైన ఆయుధాగారంపై సుమారు 907 కిలోగ్రాముల బరువైన బంకర్-బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే లక్ష్యంగా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ప్రకారం.. ఈ దాడిలో భారీ సంఖ్యలో పెనెట్రేటర్ మందుగుండు సామగ్రిని ప్రయోగించారని.. దీంతో భూగర్భ, పటిష్టమైన స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అమెరికా అధికారి ధృవీకరించారు.
Also Read
ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఇస్ఫహాన్‌లోని ప్రధాన ఆయుధాగారంపై అమెరికా 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించిందని అధికారులు తెలిపారు. మార్చి 7-8 తేదీల్లో కూడా ఇదే ప్రదేశంపై అమెరికా దాడి చేసింది. మరోసారి విధ్వంసం సృష్టించడానికి బంకర్-బస్టర్ ఆయుధాలను ఉపయోగించింది.
అమెరికా రక్షణ అధికారుల ప్రకారం.. ఇస్ఫహాన్ ఆయుధాగారాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించారు. భూమిలోపల చాలా లోతుగా నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగల సామర్థ్యం ఈ బాంబులకు ఉంది. ఇస్ఫహాన్‌లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే. దాడి అనంతరం ఆ ప్రాంతమంతటా భారీ పేలుళ్లు సంభవించాయి.
ఇది కూాడా చదవండి: Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?
ఇదిలా ఉండగా దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో జరిగిన వరుస పేలుళ్ల వీడియోను తన ‘‘ట్రూత్ సోషల్’’ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో రాత్రి చీకటిలో మంటలు, ఆకాశం వైపు భారీ పొగ మేఘం ఎగసిపడటం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూాడా చదవండి: Iran-US: భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి
Massive explosions seen tonight in the Central Iranian city of Isfahan, following airstrikes by Israel and/or the United States. pic.twitter.com/K2iI8Dukwd
— OSINTdefender (@sentdefender) March 31, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?