US-Hormuz: హార్ముజ్‌పై అమెరికా-ఇరాన్ గుడ్‌న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
- హార్ముజ్‌పై అమెరికా-ఇరాన్ గుడ్‌న్యూస్
- తీరనున్న చమురు కష్టాలు!
- ఒప్పందంపై ఇరాన్ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కొన్ని గంటల ముందు రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా హార్ముజ్ జలసంధిపై నెలకొన్న సందిగ్ధం వీడబోతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రాథమిక ముసాయిదా జరిగిందని.. త్వరలోనే హార్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య రవాణా నౌకలు యధావిథిగా ప్రయాణాలు జరగొచ్చని తెలుస్తోంది.
హార్ముజ్‌పై నావికా దిగ్బంధాన్ని ఎత్తివేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లుగా ఇరాన్ ప్రభుత్వ టీవీ పేర్కొంది. రెండు దేశాల మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా సైనిక బలగాలు ఉపసంహరణ, నావికా దిగ్బంధానాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నట్లు తెలిపింది. దిగ్బంధం ఎత్తేస్తే.. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ హామీ ఇచ్చిందని పేర్కొంది.
Also Read
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
ఇక అమెరికాతో ఉన్న సంఘర్షణను ముగించేందుకు కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రాథమిక అనధికారిక ముసాయిదా ప్రతిని టెహ్రాన్ అందుకుందని ఇరాన్ ప్రభుత్వ టీవీ నివేదించింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఇరాన్ ఒక నెలలోపు హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరిస్తుంది. అదే సమయంలో అమెరికా.. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తన సైనిక దళాలను ఉపసంహరించుకుని.. నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది.
ఇక యుద్ధ నౌకల మోహరింపులో మార్పులు ముసాయిదాలో చేర్చలేదని నివేదించింది. అంతేకాకుండా ఒమన్‌తో కలిసి హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణాను ఇరాన్ నిర్వహించడంపై ఇంకా ధృవీకరణ రాలేదు. పక్కా ధృవీకరణ లేకుండా టెహ్రాన్ ఎలాంటి చర్య తీసుకోదని కూడా ఈ ముసాయిదాలో పేర్కొంది.
- Tags
- Hormuz Strait
- Iran
- Oil shipping
- us
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!