Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: ఊహాగానాలు వద్దు.. మీడియా కథనాలను తోసిపుచ్చిన అమెరికా దర్యాప్తు సంస్థ

Ahmedabadplanecrash

Ahmedabadplanecrash

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటీవల జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన కథనాలు హల్‌చల్ చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా కథనాలు వండి వార్చాయి. ఇటీవల విడుదలైన ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఈ ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెంట్ తోసిపుచ్చారు. అవన్నీ ఊహాజనిత కథనాలేనని స్పష్టం చేశారు. ఇక మీడియా కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తుది నివేదిక రాకుండా కథనాలు ఎలా ప్రసారం చేస్తారంటూ ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: UP: యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం.. డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ఎన్‌టీఎస్‌బీ సాయంతో భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. దర్యాప్తు సమయంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ ప్రజలను కోరారు. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుందని,. ఏఏఐబీ కొనసాగుతున్న దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నట్లు ఎన్‌టీఎస్‌బీ ఎక్స్‌లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Delhi: ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ మాజీ అధికారి రాజీనామా

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో.. పైలట్‌ల్లో ఒకరు మరొకరిని ఎందుకు కట్-ఆఫ్ చేశావని అడుగుతున్నట్లు వినబడింది. మరొక పైలట్ తాను అలా చేయలేదని ప్రతిస్పందించాడు అని ప్రాథిమక నివేదిక తెలిపింది. అయితే విమానంలో 11A దగ్గర కూర్చున్న ప్రయాణీకుడు విశ్వాష్‌కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు దర్యాప్తు అధికారులతో మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో ఆగిపోయిందని చెప్పాడు. ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయని పేర్కొన్నాడు. క్రాష్‌ కాకుండా చూసేందుకు పైలట్లు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా రమేష్ తెలిపాడు. కానీ అంతలోనే కూలిపోయిందని చెప్పాడు. ఇక విమానం కూలిపోక ముందు కేవలం 625 అడుగుల ఎత్తులోనే ఉంది. అదే 3,600–4,900 అడుగుల ఎత్తులో ఉంటే మాత్రం విమానం ప్రమాదానికి గురి కాకుండా నియంత్రించొచ్చు. అందువల్లే పైలట్లకు సాధ్యం కాలేదు.

ఇది కూడా చదవండి: Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.

Exit mobile version