నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్‌ల్లో వస్తోన్న తాజా చిత్రం ‘అఖండ 2’. గతంలో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ కొట్టిందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘అఖండ 2’ని అంతకుమించి తీర్చిదిద్దేలా బోయపాటి శ్రీను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తుండగా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని దసరా కానుగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించినప్పటికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్‌కి చెక్ పెడుతూ బోయపాటి శ్రీను కార్లిటీ ఇచ్చాడు. ‘ ‘అఖండ 2’ దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నప్పటికి. తాజాగా అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతి ను ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నట. గతంలో బాలయ్య విజయశాంతి కాంబోలో మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో ఈ కలయిక మళ్లీ కుదిరితే అదిరిపోతుందని బోయపాటి ఫీల్ అవుతున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.ప్రజంట్ విజయ్ శాంతి కూడా ఫామ్ లోనే ఉంది. రీసెంట్ గా వైజయంతి మూవీతో మంచి హిట్ కూడా కొట్టింది.