US-Iran War: ఇరాన్‌లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
- ఇరాన్‌లో ఎవరూ ఉండొద్దు
- తక్షణమే ఖాళీ చేయండి
- పౌరులకు అమెరికా హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మధ్యప్రాచ్యం యుద్ధం ప్రారంభమై 27 రోజులైంది. ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
తాజాగా భద్రతాపరమైన ముప్పు కలిగి ఉన్న నేపథ్యంలో ఇరాక్‌ను విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం పౌరులను కోరింది. ఈ మేరకు ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న సాయుధ బృందాలు.. కుర్దిష్ ప్రాంతంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని పేర్కొంది.
Also Read
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
ఇక ఇరాక్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ దాడుల ముప్పు కొనసాగుతున్నందున అమెరికా పౌరులు వెంటనే ఇరాక్‌ను విడిచి వెళ్లాలని సూచించింది. బాగ్దాద్‌లోని రాయబార కార్యాలయాన్ని గానీ, ఎర్బిల్‌లోని కాన్సులేట్‌ను గానీ సందర్శించవద్దని హెచ్చరించింది. ఇక విమాన ప్రయాణాలకు అంతరాయం కొనసాగుతున్నందున.. దేశం విడిచి వెళ్లాలనుకునే వారు జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ వంటి పొరుగు దేశాలకు భూమార్గాల ద్వారా వెళ్లాలని సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా లీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన, గ్యాస్ క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం
తాజావార్తలు
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
ట్రెండింగ్
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!