ప్రస్తుతం బిజీ లైఫ్‌లో కాస్తా రిలాక్సేషన్ కోసం చాలామంది పర్యటనలకు వెళ్తుంటారు. ఇందుకు కోసం తమకు నచ్చిన డెస్టినేషన్ వెతుక్కుని కొన్ని రోజుల పాటు అక్కడ సేద తీరి వస్తారు. మళ్లీ యదావిధిగా తమ రోటీన్ లైఫ్‌కి స్టార్ట్ చేస్తారు. అయితే చాలామంది ప్రపంచాన్ని చూట్టేయాలని, విదేశీ పర్యటనలు చేయాలని కలలు కంటుంటారు. కానీ ప్రపంచ పర్యటన చేయడమనేది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే ఓ వృద్ధ జంట మాత్రం ప్రపంచాన్ని చూట్టేయాలని తమ కలను నిజం చేసుకోవాలనుకుంది. అందుకే ఆస్తి మొత్తం అమ్మేసి వరల్డ్ టూర్‌ని ఎంజాయ్ చేస్తోంది.
Also Read: MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
ఇప్పటికే పలు దేశాలు చూట్టేసిన ఈ జంట ప్రస్తుతం క్రూయిజ్ షిప్‌లో డొమినికన్ రిపబ్లిక్‌లో పర్యటిస్తోంది. అమెరికాకు చెందిన జాన్, మెలోడీ హెన్నెస్సీ దంపతులు ప్లోరిడాలో నివసించేవారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం భర్త జాన్ రిటైర్‌ర్మెంట్ అవ్వడంతో ఈ భార్యతో కలిసి వరల్డ్ టూర్‌కు ప్లాన్ చేశాడు. ఇందుకోసం 2020లో తమ ఇల్లు, బిజినెస్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు అమ్మేసుకున్నారు. ఆస్తీ మొత్తం అమ్మేసిన ఈ జంట 2020లో తమ పర్యటనను ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఓ ప్రకటన చూసి క్రూయిజ్ షిప్ బుక్ చేసుకున్నాడు. దీని ద్వారా 274 రోజులు అంటే 9నెలలు పర్యటించనున్నారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్ షిప్‌లో భార్యతో కలిసి ప్రపంచాన్ని చూట్టేస్తున్నాడు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ జంట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ పసిఫిక్ వంటి ఇతర దేశాలు పర్యటించిన ఈ జంట ప్రస్తుతం డొమినికన్ రిపబ్లిక్‌లో వాలిపోయారు. ఈ మేరకు ఈ జంట న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘రిటైర్మెంట్ అనంతరం వరల్డ్ టూర్‌కు ప్లాన్ చేశాం. దీంతో మా ఆస్తులన్నీ అమ్మేసుకున్నాం. బిజినెస్, ఇల్లుతో పాటు విలువైన కార్లు ఇతరత్రా వస్తులు అమ్మి వచ్చిన డబ్బుతో టూర్ ప్రారంభించాం. మొదట మోటర్ హోం కొని దానిలో పర్యటించాం. అది అలసటగా అనిపించడంతో క్రూయిజ్ షిప్‌కు షిఫ్ట్ అయ్యాం. 9 నెలలుగా ఇందులోనే జీవిస్తు్న్నాం. త్వరలోనే క్రూయిజ్‌లో శాశ్వత ఇల్లు కొనుగోలు చేయబోతున్నాం. ఈ సముద్ర నివాసం భూమిపై కంటే తక్కువ ఖర్చు కూడుకుంది.
Also Read: Rajinikanth : కోర్టులో హీరో రజినీకాంత్ భార్యకు ఊరట.. ఆ కేసుకు బెయిల్ మంజూరు..
గతంలో భూమిపై మాకు సంవత్సరానికి 59,000 పౌండ్స్ ఖర్చు వచ్చేది.. కానీ ఈ క్రూయిజ్ షిప్ సంవత్సరానికి 27,000 పౌండ్ల ఖర్చు మాత్రమే వస్తుంది. ఇది మాకు చాలా చౌకబారుగా ఉంది. అందుకే ఇక్క శాశ్వత నివాసం కోసం క్రూయిజ్ షిప్‌లో 30 సెంట్ల విల్లా కోనుగోలు చేశాం. ఇందులో మేము 15 ఏళ్ల పాటు జీవించోచ్చు. 2024లో మేము దానిలో షిఫ్ట్ అవుతున్నాం కూడా. కాబ్టటి ఇకపై మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే తమకు ఇక ఎలాంటి ఇంటి ఖర్చులు, కారు ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ కట్టే బాధ్యత లేదు’ అని చెప్పుకొచ్చారు.