Trump 100% Tariff: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, తనకు 7 యుద్ధాలను ఆపన తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న అతడికి నిరాశే ఎదురైంది. దీంతో శుక్రవారం నాడు చైనాపై కొత్త వాణిజ్య చర్యలను చేపడుతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని, అలాగే అమెరికాలో తయారైన కీలక సాఫ్ట్‌వేర్‌లపై కఠినమైన ఎగుమతి నియంత్రణలను అమలు చేస్తామని చెప్పుకొచ్చాడు. ఈ నిర్ణయంతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
Read Also: Astrology: అక్టోబర్ 11, శనివారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏం చేయాలంటే..?
అయితే, చైనా వాణిజ్యంపై అత్యంత దూకుడు వైఖరిని ప్రదర్శిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దీనికి సమాధానంగా తాము కూడా ప్రతిస్పందిస్తామని ప్రకటించారు. ఈ 100 శాతం టారీఫ్స్ నిర్ణయం అమలులోకి వస్తే, ఇది వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అనేక రంగాలను తీవ్ర ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేగాక, చైనా అరుదైన భూ మూలకాలపై ఎగుమతి నియంత్రణలను విస్తరించడంపై కూడా ఈ ప్రకటన చేశారు. ఈ చర్యల కారణంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో తాను ముందుగా ప్రకటించిన సమావేశాన్ని రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు పంపించాడు.