Rare-earth minerals: అమెరికా, చైనాల మధ్య రేర్-ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. చైనా తాజాగా రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
Trump 100% Tariff: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు చైనాపై కొత్త వాణిజ్య చర్యలను చేపడుతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని, అలాగే అమెరికాలో తయారైన కీలక సాఫ్ట్‌వేర్‌లపై కఠినమైన ఎగుమతి నియంత్రణలను అమలు చేస్తామని చెప్పుకొచ్చాడు.