Site icon NTV Telugu

India-Pakistan Tensions: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. సమస్య పరిష్కారం కోసం భద్రతా మండలి కీలక భేటీ..

Un

Un

India-Pakistan Tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా ప్రాంతీయ పరిణామాలను ఐక్యరాజ్యసమితికి వివరిస్తాం.. అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన వాస్తవాలను అందించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలలో ఈ దౌత్య సమావేశం ముఖ్యమైందని భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు.

Read Also: TTD: వేసవి సెలవుల్లో భక్తులకు టీటీడీ బంపరాఫర్

అయితే, భారత్- పాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఈ మీటింగ్ లో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన తమ వాదనలు తెలియజేయనున్నారు. ఇక, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ తో ఉగ్రవాద సంబంధాలు బయటపడిందని భారత్ ఆరోపించింది. దీంతో దాయాది దేశంతో ఉన్న సింధు జలాలతో పాటు వాణిజ్య ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. పాకిస్తాన్ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేయడంతో పాటు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని ఐక్యరాజ్యసమితికి ఇండియా హెచ్చరించింది.

Read Also: Meenakshi : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్!

కాగా, భారతదేశం తన దౌత్యపరమైన చర్చల్లో భాగంగా భద్రతా మండలిలోని ఎనిమిది శాశ్వత సభ్య దేశాలను కూడా సంప్రదించింది. పహల్గామ్ దాడి తరువాత, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు అట్టారి- వాఘా సరిహద్దును పూర్తిగా బంద్ చేసింది భారత్. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ తన గగనతలాన్ని అన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసింది.

Exit mobile version