Joe Biden: అమెరికాను నమ్మి రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు పెద్దన్న పెద్ద షాకే ఇచ్చింది. ఏ విషయంపై ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైందో ఇప్పుడు అదే సాధ్యం కాదుపో అంటోంది. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నించడంతోనే ఉక్రెయిన్, రష్యాల మధ్య వివాదం యుద్ధం వరకు వెళ్లింది. అమెరికా ఇచ్చే ఆయుధాలు, ఆర్థిక, సైనికసాయంతో ఉక్రెయిన్ రష్యాతో పోరాడుతోంది.
Read Also: Income Tax Filing: ఫారమ్-16 లేకుండా కూడా ఐటీఆర్ ఫైలింగ్ ఫైల్ చేయవచ్చు.. ఎలానో తెలుసుకోండి?
ఇదిలా ఉంటే నాటో కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ కి అమెరికా ప్రత్యేక ఏర్పాట్లు చేయదని శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రమాణాలకు అనుగుణంగా ఉక్రెయిన్ నాటోలో చేరాలని, కాబట్టి మేము దాన్ని సులభతరం చేయబోమని ఆయన వాషింగ్టన్ లో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
ఏడాదిన్నరగా ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ ముగియలేదు. మరోవైపు రష్యా చర్యలకు సిద్ధం అని చెబుతూనే ఉంది. అయితే తాను ఆక్రమించిన లూహాన్క్స్, డోనెట్క్స్, జపొరోజ్జియా, ఖేర్సన్ ప్రాంతాలపై రష్యా భూభాగాలుగా గుర్తించాలని చెబుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని 18 భూభాగాన్ని రష్యా హస్తగతం చేసుకుంది. ఇరు దేశాల మధ్య యుద్ధం వల్ల ప్రపంచం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా రష్యా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో యూరోపియన్ యూనియన్ దేశాలు సతమతమవుతున్నాయి. పలు దేశాలు ఆర్థికమాంద్యంలోకి కూరుకుపోతున్నాయి.