Site icon NTV Telugu

Zelensky: భారత్‌పై ఆంక్షలు విధించడంలో తప్పులేదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

Ukrine

Ukrine

Zelensky: భారత్‌పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కో-కీవ్‌ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్‌ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతడి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం గమనార్హం. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌లు విధించడం సరైన చర్యే అని వెల్లడించారు. అయితే, ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ప్రధాని మోడీ తియాంజెన్‌లో చైనా అధినేత జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి వేదిక పంచుకోవడంపై జెలెన్‌స్కీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Kollywood : ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. కన్ఫమ్ చేసిన స్టార్ హీరో

అయితే, అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్- పుతిన్‌ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి అగ్రరాజ్యం అమెరికా రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ కెవిన్‌ హస్సెట్ట్‌ మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తారని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి సహకరించే వారిపై కూడా ఈ ఆంక్షలు అమలు చేస్తామన్నారు.

Read Also: Supreme Court: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు.. సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పిటిషన్ కొట్టివేత

కాగా, ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని భారత్‌ కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోడీ అటు పుతిన్‌, ఇటు జెలెన్‌స్కీతో సుధీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్‌తో సమావేశానికి ముందు కీవ్ అధినేతతోనూ మాట్లాడారు. ఉక్రెయిన్‌కు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్‌ చూస్తుంటే.. ఇప్పుడు ఇండియాపైనే జెలెన్‌స్కీ విమర్శలు చేయడం గమనార్హం.

Exit mobile version