IND vs UAE: ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా
- హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్‌లో.
- భారత్ - యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్.
- ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs UAE: హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్‌లో భారత్, యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ లో టీమిండియా 1 పరుగు తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ 6 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 6 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఒక పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది. యూఏఈపై టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 430 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులతో విద్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు స్టువర్ట్ బిన్నీ కూడా 11 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 400 స్ట్రైక్ రేట్‌తో 44 పరుగులు చేశాడు.
Read Also: IND vs NZ: ఎదురుదాడి చేస్తున్న టీమిండియా.. లంచ్ సమయానికి 195/5
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
టీమిండియా విజయానికి చివరి ఓవర్‌లో 32 పరుగులు కావాలి. ఈ సమయంలో బిన్నీ 4 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. అయితే, అదృష్టం చివరి బంతికి టీమిండియా వైపు అనుకూలంగా లేదు. చివరి బంతికి బిన్నీ రనౌట్ కావడంతో టీమిండియా 1 పరుగుతో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇక యూఏఈ తరఫున ఖలీద్ ఖాన్, జహూర్ ఖాన్ లు బ్యాట్ తో రెచ్చిపోయారు. ఓపెనర్ ఖలీద్ 10 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేయగా.. జహూర్ ఖాన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌ల ఆధారంగా టీమిండియా జరిగిన మ్యాచ్‌లో యూఏఈ 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. స్టువర్ట్ బిన్నీ 2 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
India needed 32 in 6 balls:
Stuart Binny – 4,WD,6,6,6,6,1. India lost by just 1 run. 💔 pic.twitter.com/qyhKWWyqe6
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!