Female Guise: కొందరు దొంగతనాలకు బాగా అలవాటు పడిపోయారు. దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దొంగతనాలు చేసేందుకు పక్కాప్లాన్ లు వేస్తున్నారు. కొందరు దొంగలు తాళాలు వేసిన ఇళ్లకు టార్గెట్ చేస్తే.. మరొకొందరు రాత్రిపూట పడుకున్న ఇళ్లకు టార్గెట్ చేస్తున్నారు. ఇంకొందరైతే పట్టపగలే మహిళ మెడలో వున్న చైన్ పై కన్నేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలే వారి హాబీ మార్చుకుని దొరలా బతికేస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వారికి చిక్కకుండా పక్కదారి పట్టి వారినుంచి తప్పించుకుంటూ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. అయితే నేను చెప్పే ఈదొంగ మాత్రం ఓలెవన్ ఉందండోయ్. దొంగతనాలు చేసేందుకు ఆడవేశం ధరంచడం ఎవరికి చిక్కకుండా పరార్ అవడం బాగా అలవాటు చేసుకున్నాడు. చిరవకు పోలీసుల చేతికి చిక్కాడు. ఈఘటన సంగారెడ్డి జిల్లా ఐడియాబొల్లారంలో చోటోచేసుకుంది.
Read also: Hyderabad new Nizam: వారసుడు ఆయనే.. ప్రకటించింది చౌమహల్లా ప్యాలెస్
సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారంలో దొంగతనాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గంజాయి సేవించడమే కాకుండా.. ఆడ వేషం ధరించి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు ఎట్టకేలకు స్థానికులు పట్టుకున్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని IDA లో రాత్రి పాన్ షాప్, కిరణం షాప్ తాళాలు పగలగొట్టి అందులో వున్న మొత్తం డబ్బును కాజేశారు. అంతటితో ఆగలేదు దుండగలు ఇంకా దోచేయాలని అనుకున్నారు. మళ్లీ అక్కడి నుంచి కంపెనీ లోకి దొంగతనానికి మెల్లగా చప్పుడు లేకుండా లోని ప్రవేశించారు. అది గమనించిన కంపెనీలో పనిచేసే సెక్యూరిటీ స్థానికులకు సమాచారం ఇచ్చాడు. అందరు కలిసి వారిని గమనించి అక్కడ వున్న సొత్తును దోచుకుంటుండగా మూకుమ్ముడిగా లోపలికి వెళ్లి ఆఇద్దరి దొంగలను పట్టుకున్నారు. దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించినా అందరూ గుమిగూడారు. దీంతో దొంగలు తప్పించుకునే దారిలేక బిత్తరిచూపులు వేస్తూ ఉండిపోయారు. ఇక స్థానికులు, సెక్యూరిటీ కలిసి ఆఇద్దరి దొంగలను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే పనిలో పడ్డారు. ఒక్కరు గంజాయి మత్తులో ఉన్నాడని, మరొకరు ఆడవేషం ధరించాడని తెలిపారు. వీరి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి వుందని పేర్కొన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలసీలకు అప్పగించడంతో.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
Gold Biscuits: లగేజ్ బ్యాగ్ లో బిస్కెట్లు.. తినేవి కాదండోయ్