UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం
- ఉగ్ర సంస్థగా ప్రకటన
- జాతీయ ప్రయోజనాల కోసమేనని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు బ్రిటన్ బిగ్ షాకిచ్చింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఐఆర్‌జీసీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణించింది. ఈ పరిణామంతో ఇరాన్-ఐరోపా దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని యూకే నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత యూకేలో ఐఆర్‌జీసీకి మద్దతు ఇవ్వడం నేరంగా పరిగణించబడుతుంది. ఈ సంస్థను నిషేధించడంపై బ్రిటన్‌లో చాలాకాలంగా జరుగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను సమీక్షించిన తర్వాత యూకే జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో ఐఆర్జీసీ పాలుపంచుకుందని నిర్ధారణకు వచ్చినట్లు యూకే హోం ఆఫీస్ పేర్కొంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ నిర్ణయం అవసరమని ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్లు.. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ది కంపానియన్స్ ఆఫ్ ది రైట్ (IMCR), రష్యన్ ఫెడరేషన్ వాలంటీర్ కార్ప్స్లను కూడా తమ నిషేధిత సంస్థల జాబితాలో చేర్చనున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకారం.. బ్రిటన్‌లోని యూదు లక్ష్యాలపై జరిగిన దాడులతో IMCRకు సంబంధం ఉండగా.. రష్యన్ ఫెడరేషన్ వాలంటీర్ కార్ప్స్‌ను రష్యన్ సైనిక గూఢచార సంస్థతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగంగా అభివర్ణించారు.
బ్రిటన్ గడ్డపై ఇరాన్‌కు సంబంధించిన భద్రతాపరమైన ముప్పులు, కుట్రల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ఇంటర్నేషనల్ టెలివిజన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై జరిగిన హత్యాయత్నం, బ్రిటీష్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ దాడులు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఘటనలు బ్రిటీష్ భద్రతా సంస్థలలో ఆందోళనలను రేకెత్తించాయి. అందుబాటులో ఉన్న అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. చట్టపరమైన సమీక్ష జరిపిన అనంతరం ఈ సంస్థల కార్యకలాపాలు విదేశీ శక్తులతో ముడిపడి ఉన్న భద్రతా ముప్పును కలిగిస్తున్నాయని హోం ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది. యూకే భద్రతను కాపాడటానికి, పౌరులను రక్షించడానికి, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి వాటిని నిషేధించడం అవసరమని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇరాన్ వార్తాపత్రికలో 13 మంది హిట్‌లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ పేరు కూడా ఉంది. అమెరికా, ఐరోపా నేతలను టార్గెట్ చేసుకుని జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వార్త అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!