Govt Shutdown: షట్‌డౌన్ గండం నుంచి తప్పించుకున్న అమెరికా..
- షట్‌డౌన్ ప్రమాదం నుంచి తప్పించుకున్న అమెరికా..
- ప్రభుత్వ కార్యకలాపాలు సంబంధించిన బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం..
- సెనెట్‌కు పంపిన కొత్త ప్రణాళిక బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt Shutdown: షట్‌డౌన్ ప్రమాదం నుంచి అగ్రరాజ్యం అమెరికా గట్టెక్కినట్లే కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ లాస్ట్ మినిట్ లో ఆమోదించింది. శుక్రవారం సాయంత్రం ( యూఎస్ కాలమానం ప్రకారం) స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశ పెట్టిన కొత్త ప్రణాళిక బిల్లుకు ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్రణాళిక నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ బిల్లును సెనెట్‌కు పంపగా.. అక్కడ కూడా ఆమోదం పొందితే అమెరికా షట్‌డౌన్ ముప్పు నుంచి తప్పించుకుంటుంది.
Read Also: Canada: ట్రూడోకు జగ్మీత్‌సింగ్ షాక్.. లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం!
Also Read
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
కాగా, సర్కార్ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా జో బైడెన్ కార్యవర్గం ఈ బిల్లును తెచ్చింది. దీన్ని తొలుత ట్రంప్ వ్యతిరేకించారు. అలాగే, సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్ల పాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలని అతడు డిమాండ్ చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం నాడు సరికొత్త బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ, ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో 235-174తో వీగిపోయింది. ఈ బిల్లుకు ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి వ్యతిరేకంగా ఓటు వేశారు.
Read Also: Hit And Run Accident: క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, 60 మందికి పైగా
అయితే, ఈ పరిణామాలపై వైట్ హౌస్ కూడా కీలక కామెంట్స్ చేసింది. షట్‌డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడంతో.. అతడు చేసిన డిమాండ్లను తొలగించిన తర్వాత సమాక్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సాయం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశ పెట్టగా.. 366-34తో ప్రతినిధుల సభ ఆమోదించింది. మెజార్టీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు మద్దతుగా ఓటేశారు. ఆ తర్వాత దీన్ని సెనెట్‌కు పంపించారు. ప్రస్తుతం సెనెట్‌లో డెమోక్రాటిక్ పార్టీ వారే ఆధిక్యంలో ఉండటంతో.. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే.
తాజావార్తలు
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!