బెటర్ వర్డ్స్ మ్యాన్… సిద్ధార్థ్ ట్వీట్ పై సైనా భర్త రియాక్షన్

సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపాన్ని ప్రస్తావిస్తూ జనవరి 5న సైనా నెహ్వాల్ “తమ సొంత ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదు. నేను ఖండిస్తున్నాను. ప్రధాని మోదీపై అరాచకవాదుల పిరికి దాడి” అంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కు సిద్ధార్థ్ రిప్లై ఇస్తూ “సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #రిహన్నా” అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ చేసిన ఈ ట్వీట్ వివాదానికి దారి తీసింది. మహిళా కమిషన్ తో పాటు పలువురు సెలెబ్రిటీలు సిద్ధార్థ్ పై ఫైర్ అవుతున్నాయి.

Read Also : ఐసీయూలో లతా మంగేష్కర్… కోవిడ్-19 పాజిటివ్

తాజాగా సైనా భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సోమవారం ట్విట్టర్‌లో ఈ విషయంఫైలు తన నిరాశను వ్యక్తం చేశారు. పారుపల్లి కశ్యప్ ట్విట్టర్ లో సిద్ధార్థ్‌ను ట్యాగ్ చేస్తూ “మీ అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేయడం అప్సెట్టింగ్ గా ఉంది. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి… కానీ మంచి పదాలను ఎంచుకోండి మ్యాన్ #notcool #disgraceful” అంటూ ట్వీట్ చేశారు. ఇక సిద్ధార్థ్ తన ట్వీట్ లో ఎవరినీ అగౌరవ పరచలేదు అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

సైనా నెహ్వాల్ ఈ విషయంపై ఓ మీడియాతో మాట్లాడుతూ “ఆయన ఏం చెప్పాడో నాకు ఖచ్చితంగా తెలియదు. నేను ఒక నటుడిగా అతన్ని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. ఆయన మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరచగలడు” అని చెప్పుకొచ్చింది. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ (NCW) మహారాష్ట్ర, తమిళనాడు పోలీసు అధికారులకు రాసిన లేఖలో సైనాపై చేసిన వ్యాఖ్యలకు సిద్ధార్థ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. అంతేకాదు సిద్ధార్థ్ ఖాతాను బ్లాక్ చేయమని ట్విట్టర్ ఇండియాను కూడా కోరింది.

ఇక పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ను సందర్శించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భద్రత లోపం విషయంపై కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భద్రతా ఉల్లంఘనపై ఇప్పుడు సుప్రీం కోర్టు పర్యవేక్షణ కమిటీ విచారణ జరుపుతోంది.

Related Articles

Latest Articles