Two Flights Escaped From Danger: రెండు విమానాలు గాల్లో ఉన్నప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రెండు ఫ్లైట్స్ అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నాయి. అయితే.. అదృష్టవశాత్తూ అవి ప్రమాదం నుంచి బయటపడ్డాయి. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. తొలుత ఒక విమానం నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నుంచి 150 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి బయలుదేరింది. దుబాయ్‌కు చెందిన ఫ్లైదుబాయ్ విమానం కాఠ్‌మాండూలోని త్రిభువన్‌దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే.. దాని రెండు ఇంజిన్‌లలో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టాయి. ఈ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన అధికారులు.. విమానాన్ని తక్షణమే ల్యాండ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అయితే.. ఇండికేటర్లన్నీ సాధారణంగా ఉండటంతో పైలట్లు విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లారు. ఈ సమాచారాన్ని కంట్రోల్ టవర్‌కు సమాచారం అందించగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఈ విమానంలో ఉన్న మొత్తం 150 మంది ప్రయాణికుల్లో సుమారు 50 మంది నేపాల్ ప్రయాణికులు కాగా, మిగతావారు ఇతర దేశాలకు చెందినవారు.
Virupaksha: కాంతార స్టైల్ లో విరుపాక్ష… మే ఫస్ట్ వీక్ లో పాన్ ఇండియా రిలీజ్
ఇక మరో ఘటన గురించి మాట్లాడుకుంటే.. అమెరికాలో ఒక విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లో, దాని ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఒక పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం 7:45 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కొలంబస్‌లోని జాన్ గ్లెన్ కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో.. ఇంజిను నుంచి మంటలు రావడం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విమానాన్ని వెనక్కి తిప్పి, కొలంబస్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ గాయపడలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికుల్ని మరో ఫ్లైట్‌లో ఎక్కించి, వారిని గమ్యస్థానానికి చేర్చారు. కాగా.. పక్షలు లేదా ఇతర జంతువుల వల్ల కలిగే ప్రమాదాలను ఎయిర్‌లైన్స్ వాళ్లు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇలాంటి ప్రమాదాల కారణంగా ఆయా ఎయిర్‌లైన్స్‌కి ఏటా మిలియన్ డాలర్లలో నష్టం వాటిల్లుతోంది. 2019 ఆగస్టులో ఉరల్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఒక విమానాన్ని సీగల్‌ల మంద ఢీకొట్టడంతో.. అది ఒక కార్న్ ఫీల్డ్‌లో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో 74 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Akhil Akkineni: ‘ఏజెంట్’కు ‘పఠాన్’కు పోలిక లేదు: డినో మోరియా