Akhil Akkineni: ‘ఏజెంట్’కు ‘పఠాన్’కు పోలిక లేదు: డినో మోరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agent: హీరో అఖిల్ అక్కినేని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ డినో మోరియా ప్రముఖ పాత్ర పోషించారు. ఈ మూవీ గురించి, తన పాత్ర గురించి డినో చెప్పిన ముచ్చట్లివి. తొలుత తన పాత్ర గురించి వివరిస్తూ, “ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిరిగి, వ్యవస్థపై పగ తీర్చుకునే పాత్ర ఇది. అతను ప్రత్యేక శిక్షణ తీసుకున్న పవర్ ఫుల్ ఏజెంట్. కానీ తనకు జరిగిన ద్రోహం కారణంగా ఈవిల్ గా మారిపోతాడు. తనలో చాలా మ్యాడ్ నెస్ వుంటుంది. సురేందర్ రెడ్డి గారు ఈ పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నా పాత్రలో చాలా ఎమోషన్, డ్రామా వుంటుంది” అని అన్నారు. అయితే ఇటీవల విడుదలైన ‘పఠాన్’ చిత్రంలో జాన్ అబ్రహం పాత్ర కూడా ఇదే తరహాలో ఉంటుందనే సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు డినో బదులిస్తూ, “విచిత్రంగా ‘పఠాన్’ కూడా ముగ్గురు ఏజెంట్స్ కి సంబధించిన కథ. వారికంటే ముందే మేం షూటింగ్ స్టార్ట్ చేశాం. మా కథ ముందే తయారైంది. ‘ఏజెంట్’ కథకి ‘పఠాన్’ కథతో పోలిక లేదు. రెండు వేరు వేరు. మా సినిమాలో డిఫరెంట్ టర్న్స్ అండ్ ట్విస్ట్స్ వుంటాయి. కథ భిన్నంగా వుంటుంది. ‘ఏజెంట్’ గేమ్… డిఫరెంట్ అండ్ టెర్రిఫిక్” అని అన్నారు.
ఈ సినిమాను అంగీకరించడానికి కారణం చెబుతూ, “ఈ మూవీ కథ విన్నప్పుడే చాలా నచ్చేసింది. తెలుగులోకి రావడానికి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని నిర్ణయించుకున్నాను. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇది ముగ్గురు ఏజెంట్స్ కథ. ఇందులో నేను విలన్ గా మారడానికి కూడా ఒక కారణం వుంటుంది. కథలో చాలా ప్రాధాన్యం వున్న పాత్ర నాది. నా పాత్ర పేరు గాడ్. ఏదైనా చేయగలిగే పవర్ ఫుల్ పాత్ర అది. తను వ్యవస్థపై, ఆ వ్యవస్థని క్రియేట్ చేసిన బాస్ పై రివెంజ్ తీసుకోవాలని చూస్తుంటాడు” అని చెప్పారు.
ఈ చిత్రంలో తన బాస్ గా నటించిన మమ్ముట్టి గురించి వివరిస్తూ, “ఇరవై ఏళ్ల క్రితం ‘ప్రియరాలు పిలిచింది’ సినిమాలో మమ్ముట్టి గారితో కలసి పని చేశాను. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయనతో కలసి వర్క్ చేశాను. ఆయన పని చేయడం గొప్ప అనుభూతి. ఆయన్ని సెట్స్ లో అలా చూస్తూ వుంటాను. ఇందులో ఆయనికి ఎదురుతిరిగే పాత్ర చేశాను. అది పెద్ద సవాల్ గా అనిపించిది. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఆయన అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. ఆయన్ని మొదటిసారి బుడాపెస్ట్ లో కలిసినప్పుడు దుల్కర్ కంటే యంగ్ గా కనిపించారు. ఇదే విషయం ఆయనకి చెబితే నవ్వేశారు. నా వరకూ.. ఆయన నా టీచర్ నేను ఆయన స్టూడెంట్ ని. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే నాకు బిగ్గెస్ట్ కాంప్లీమెంట్ మమ్ముట్టి గారి నుంచి వచ్చింది. డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత మమ్ముట్టి గారు నన్ను చూసి.. “ఫెంటాస్టిక్.. చాలా అద్భుతంగా చేశావు’’ అన్నారు. ఆ మాటలని ఎవరైనా రికార్డ్ చేసివుంటే బావుండేదని పించింది. ఇది లైఫ్ టైమ్ మెమరీ” అని తెలిపారు.
ఈ పాత్ర పోషణకై చేసిన హోమ్ వర్క్ గురించి చెబుతూ, “కొన్ని మ్యాడ్ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేశాను. ‘నో ప్లేస్ ఫర్ ఓల్డ్ మెన్’ తో పాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను. అలాగే ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రని పరిశీలించాను. నా పాత్రలో కూడా మ్యాడ్ నెస్ వుంటుంది. నేను ఎంత హోమ్ వర్క్ చేసినా సురేందర్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ కావాలి అని అడిగేవారు. ఇందులో ప్రతిది లౌడ్ లార్జ్ ఎక్సయిటింగా వుంటుంది” అని అన్నారు. షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియచేస్తూ, “దర్శకుడు సురేందర్ రెడ్డి డెడ్లీ లుక్ కావాలని అడిగారు. నాలుగు లేయర్ల కాస్ట్యూమ్స్ తో అద్భుతంగా కుదిరింది. బుడాపెస్ట్ చలిలో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. తర్వాత కొన్ని యాక్షన్ సీన్లు మస్కట్ ఎడారి లో షూట్ చేశాం. 40 డిగ్రీల వేడి. లెదర్ జాకెట్ , హెవీ మెటిరియాల్ లాంగ్ కోట్ ధరించి షూట్ చేయాల్సి వచ్చింది. లోపల నుంచి చెమట బూట్లు నుంచి బయటికి వచ్చేది. అదొక హారిబుల్ ఫీలింగ్. చాలా క్రేజీ. అయితే ఆ కష్టానికి తగిన ఫలితం దొరుకుతుందనే నమ్మ్మకం వుంది” అని అన్నారు. అఖిల్ ను చాలా కాలం క్రితమే కలిసిన విషయాన్ని వివరిస్తూ, “రామ్ చరణ్ నా ఫ్రెండ్. అతని ద్వారా అఖిల్ ని ఒకసారి కలిశాను. అప్పటికి అతను చాలా యంగ్ లిటిల్ బాయ్ లా కనిపించారు. కానీ ‘ఏజంట్’ సెట్ లో అఖిల్ ని చూసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా కనిపించాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. తన లుక్ మొత్తం మార్చేశాడు. తన డెడికేషన్ కి హ్యాట్సాఫ్” అని అన్నారు. ఒక నటుడిగా అన్ని భాషల్లో సినిమాలు చేయాలన్నది తన కోరిక అని త్వరలోనే మలయాళం చిత్రంలోనూ నటించబోతున్నానని డినో మోరియా తెలిపారు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..