TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
- అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా
- రాజీనామా వార్త అమెరికా రాజకీయ వర్గాల్లో సంచలనం
- రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలనే ప్రధానంగా పేర్కొన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తులసి గబ్బార్డ్ తన రాజీనామా లేఖను X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు, అందులో తన భర్త అబ్రహాంకు అత్యంత అరుదైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామా వార్త అమెరికా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
తులసి గబ్బార్డ్ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలనే ప్రధానంగా పేర్కొన్నారు. ఆమె భర్త అబ్రహామ్ విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో, కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. “ఈ క్లిష్ట సమయంలో నా భర్తకు అండగా ఉండటం నా బాధ్యత” అని ఆమె పేర్కొన్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. తమ 11 ఏళ్ల వివాహ బంధంలో తన భర్త తనకు అండగా నిలిచారని గాబార్డ్ అభివర్ణించారు.
Also Read
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు వార్నింగ్
- Trump: ఫుట్‌బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్‌లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ రాజీనామాపై మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, విదేశాంగ విధానాలపై ఆమె అభిప్రాయాలు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరికి భిన్నంగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇరాన్‌పై అమెరికా దాడుల విషయంలో ఆమె మితమైన వ్యాఖ్యలు చేయడం వైట్ హౌస్‌లో అసంతృప్తికి కారణమైందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
తులసి గబ్బార్డ్ 2025 ఫిబ్రవరిలో అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె అమెరికా సైన్యంలో సేవలందించిన మాజీ సైనికురాలు కాగా, గతంలో హవాయ్ నుంచి కాంగ్రెస్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఒకప్పుడు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఆమె, తరువాత స్వతంత్ర రాజకీయ వైఖరితో గుర్తింపు పొందారు.
ఆమె రాజీనామా జూన్ 30, 2026 నుంచి అమల్లోకి రానుంది. అప్పటివరకు ఆమె విధుల్లో కొనసాగనున్నారు. ఆమె స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆరోన్ లూకాస్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గబార్డ్ రాజీనామా దురదృష్టకరమని, డీఎన్ఐగా తన పదవీకాలంలో ఆమె “గొప్ప పని” చేశారని ట్రంప్ కొనియాడారు.
తులసి గబ్బార్డ్ ఎవరు?
తులసి 1981లో అమెరికన్ సమోవాలో మైక్ గబ్బార్డ్, కరోల్ గబ్బార్డ్ దంపతులకు జన్మించింది. ఆమె గబ్బార్డ్ దంపతుల ఐదుగురు సంతానంలో ఒకరు. 1983లో, గబ్బార్డ్‌కు రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం అమెరికాలోని హవాయి రాష్ట్రానికి వలస వెళ్లింది. హవాయికి చేరుకున్న తర్వాత, ఆమె తల్లి కరోల్ హిందూ మతంలోకి మారగా, ఆమె తండ్రి రోమన్ కాథలిక్‌గా ఉండేవారు. హిందూ మత ప్రభావం వల్ల, కరోల్ తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. తులసి గబ్బార్డ్ తనను తాను హిందువుగా గుర్తిస్తుంది, కానీ ఆమె భారతీయ సంతతికి చెందినది కాదు.
తులసి తండ్రి 2004–2007 వరకు రిపబ్లికన్ పార్టీలో, ఆ తర్వాత 2007 నుండి డెమోక్రటిక్ పార్టీలో సభ్యుడిగా ఉన్నారు. 2013లో, తులసి హవాయి రాష్ట్రం నుండి మొదటిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు, ఆమె 2021 వరకు ఆ పదవిలో కొనసాగారు. రాజకీయాలకు అతీతంగా, తులసి గబ్బార్డ్ రెండు దశాబ్దాలకు పైగా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో ఇరాక్, కువైట్లలో సేవలందించారు. ఆమె 2016 ఎన్నికలకు ముందు బెర్నీ శాండర్స్ కోసం ప్రచారం చేశారు. జో బైడెన్‌కు మద్దతు ప్రకటించడానికి ముందు, 2020లో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కొద్దికాలం పాటు పోటీ చేశారు.
గాబార్డ్ యూఎస్ కాంగ్రెస్‌లో మొట్టమొదటి హిందూ సభ్యురాలు. ఆమె తన పదవీకాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య సంరక్షణ, ఉచిత కళాశాల విద్య, తుపాకీ నియంత్రణ వంటి ఉదారవాద అంశాలకు మద్దతు ఇచ్చారు.
I am deeply grateful for the trust President Trump placed in me and for the opportunity to lead @ODNIgov for the last year and a half.
Unfortunately, I must submit my resignation, effective June 30, 2026. My husband, Abraham, has recently been diagnosed with an extremely rare… pic.twitter.com/PS0Dxp5zpd
— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) May 22, 2026
తాజావార్తలు
-
DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
-
Rajendra Prasad: ‘అడిగి తీసుకుంటే అది భిక్షే’.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: జూలై 7 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!