Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్.. ఎందుకోసమంటే..!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం
- భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- కలల ‘డ్రీమ్ మిలిటరీ’ని నిర్మిస్తానని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారో.. లేదో వెనిజులా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు వాణిజ్య యుద్ధంతో ఇంకొన్ని దేశాలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
ఈ ఏడాది యుద్ధాలే అన్నట్టుగా అనూహ్యంగా అమెరికా సైనిక బడ్జెట్‌ను పెంచేశారు. 2027 నాటి సైనిక బడ్జెట్‌ను 1 ట్రిలియన్ నుంచి 1.5 ట్రిలియన్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 36 శాతాన్ని సూచిస్తుంది. ప్రపంచ భద్రతా పరిస్థితి దుర్బలంగా ఉండటంతో ఇది అవసరం అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ అమెరికా సైన్యాన్ని ‘‘డ్రీమ్ మిలిటరీ’’గా తీర్చదిద్దడానికి సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!
సెనేట్, కాంగ్రెస్, ప్రభుత్వ విభాగాలు, ఇతర రాజకీయ ప్రతినిధులతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి చాలా సున్నితమైందని.. ప్రమాదకరమైందని పేర్కొన్నారు. అందుకోసమే అమెరికా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చాలా అవసరంగా ట్రంప్ చెప్పుకొచ్చారు.
రక్షణ బడ్జెట్ పెంపుతో కలల సైన్యం నిర్మించబడుతుందని తెలిపారు. ఈ బడ్జెట్‌తో విదేశీ సవాళ్లను ఎదుర్కోవడానికి.. జాతీయ భద్రతను కాపాడటానికి అమెరికా సైన్యాన్ని శక్తివంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఇంత బడ్జెట్ పెరగడానికి టారిఫ్ విధానమే కారణమని చెప్పారు. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌లు కారణంగా దేశానికి గణనీయమైన ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఆదాయంతో దేశభక్తిగల మధ్యతరగతి పౌరులకు ఆర్థిక ప్రయోజనాలను కూడా పెంచుతుందని చెప్పారు.
ఇప్పటికే పెంపు..
గత డిసెంబర్ ప్రారంభంలోనే అమెరికా సెనేట్ 2026 సంవత్సరానికి 901 బిలియన్ల రక్షణ బడ్జెట్‌ను ఆమోదించింది. ఇక 2027 సంవత్సరానికి ఆ బడ్జెట్‌ను మరింత పెంచేశారు. సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ట్రంప్ ఈ అడుగులు వేస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!