Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
- అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- రిపబ్లికన్లు మెజారిటీ సాధించకపోతే ‘‘వీటో’’ చేస్తానని కామెంట్స్..
- డెమోక్రాట్లకు హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మధ్యంతర ఎన్నికలపై ప్రపంచంవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఈ ఎన్నికల్లో విపక్ష డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించి అమెరికన్ కాంగ్రెస్‌లో ఆధిపత్యం సంపాదిస్తే, వారి బిల్లులను అడ్డుకునేందుకు తన ‘‘వీటో’’ అధికారాన్ని ఉపయోగిస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు పంపారు. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభలో లేదా సెనెట్‌లో లేదా రెండు సభల్లో మెజారిటీ కోల్పోతే తాను ‘‘మిస్టర్ వీటో’’గా మారుతానని వ్యాఖ్యానించారు.
న్యూయార్క్ పోస్ట్‌కు చెందిన మిరాండా డివైన్ నిర్వహించే ‘‘పాడ్ ఫోర్స్ వన్’’ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు ఆధిక్యత వస్తే ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించగా.. ‘‘అప్పుడు నేను మిస్టర్ వీటోగా మారుతానేమో. వాళ్లను దేశాన్ని నాశనం చేయనివ్వను’’ అని ట్రంప్ అన్నారు. డెమోక్రాట్లు పంపించే బిల్లులను తిరస్కరిస్తానని ఆయన చెప్పారు. ఇలా నెల లేదా రెండు నెలల పాటు వరసగా వీటోలు విధిస్తే, చివరకు సమయం వృథా అవుతోందని గుర్తించి డెమోక్రాట్లు చర్చలకు వస్తారని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి రావచ్చని అన్నారు. చట్టాల ఆమోదం కోసం గతంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒప్పందాలు చేసుకున్నాయని గుర్తుచేశారు. అయితే, ఈ పరిస్థితి రాకూడదని, రిపబ్లికన్లే కాంగ్రెస్‌పై నియంత్రణ కొనసాగించాలని ఆయన కోరుకున్నారు.
Also Read
ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లే వీటో అధికారం వాడారు. మొదటిసారి అధ్యక్ష పదవీ కాలంలో ఏకంగా 10 బిల్లులను వీటో చేశారు. అమెరికా చట్టసభలు ఆమోదించిన బిల్లుల్ని తిరస్కరించే అధికారమే ‘‘వీటో’’. అయితే, అమెరికా అధ్యక్షుడు వీటో చేసినప్పటికీ, రెండు చట్టసభలు కలిసి మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు ఇస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది.
అమెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తు్న్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉంది. దీంతో ఈసారి సభపై తమ పట్టు పెంచుకోవాలని డెమోక్రాట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
-
Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
-
Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
-
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
-
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!