Trump: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అయితే, ట్రంప్‌కు నోబెల్ బహుమతి రాకపోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం స్పందించారు. ట్రంప్ శాంతి కోసం ఎంతో ప్రయత్నం చేశారని, ఉదాహరణగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ను చూపారు.
ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్, పుతిన్‌కు థాంక్స్ చెప్పారు. ప్రపంచ సంక్షోభాలను పరిష్కరించడంలో తన ప్రయత్నాలను గుర్తించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అధ్యక్షుడు పుతిన్‌కు ధన్యవాదాలు!’’ అని చెప్పారు. సంక్లిష్టమైన సమస్యలను, దశాబ్ధాలుగా కొనసాగుతున్న సంక్షోభాలను ట్రంప్ పరిష్కరిస్తారు అని పుతిన్ చెప్పిన వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు.
Read Also: Ari: శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా పోస్టర్ల తొలగింపు.. దర్శకుడికి బీజేపీ కేంద్ర మంత్రి ప్రశంసలు
అయితే, ట్రంప్ తనకు నోబెల్ రాకపోవడంపై స్పందించారు. శాంతి కోసం ఏం చేయని వారికి కూడా ఈ అవార్డు వచ్చిందని, మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి అన్నారు. మరోవైపు, వైట్ హౌజ్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ.. నోబెల్ కమిటీ శాంతి కన్నా రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. నోబెల్ రాకున్నా ట్రంప్ ప్రపంచ శాంతి కోసం అన్ని పనులు చేస్తారని చెప్పుకొచ్చారు.
ట్రంప్‌ను ప్రశంసిస్తూ పుతిన్, “అమెరికా అధ్యక్షుడు దానికి అర్హుడో కాదో తెలియదు. అతను దీర్ఘకాలిక సంక్షోభాలపై తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఉక్రెయిన్ పరిస్థితి గురించి అతను నిజాయితీగా పనిచేశారు. కొన్ని విషయాలు పనిచేశాయి, కొన్ని పని చేయలేదు. అతను ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అని అన్నారు.