Trump: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అయితే, ట్రంప్‌కు నోబెల్ బహుమతి రాకపోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం స్పందించారు. ట్రంప్ శాంతి కోసం ఎంతో ప్రయత్నం చేశారని, ఉదాహరణగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ను చూపారు.
Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆ దేశంలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తూ, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారి జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అంతర్గత రాజకీయ మార్పుల గురించి ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరుగుతున్న ‘‘బ్రిక్స్’’ సమావేశానికి జిన్ పింగ్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు.