Site icon NTV Telugu

Trump: అలాగైతే అమెరికా నాశనమే.. టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

Trump

Trump

సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాగైతే అమెరికా పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. సుంకాలను తొలగించడం అమెరికా వినాశనానికి దారి తీస్తుందని తెలిపారు. తీర్పు వెలువరించిన న్యాయమూర్తులపై ధ్వజమెత్తారు. వారంతా ‘రాడికల్ లెఫ్ట్ గ్రూప్’ అంటూ ముద్ర వేశారు. ఇక భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ధైర్యంపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఆ న్యాయమూర్తి ఒబామా నియమించిన డెమొక్రాట్ అని అభివర్ణించారు. ఆ జడ్జి యూఎస్‌ను ప్రేమిస్తున్నారని.. అంతేకాకుండా గౌరవిస్తున్నారని.. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: SCO Summit: నేడే మోడీ-పుతిన్ కీలక భేటీ.. కీలకంగా మారనున్న అమెరికా టారిఫ్!

ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో సుంకాలు కారణంగా ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని శుక్రవారం అమెరికా ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తీర్పు వెలువరిచింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఓపెన్-ఎండ్ సుంకాలను అమలు చేసే అధికారం ట్రంప్‌కు లేదని న్యాయస్థానం పేర్కొంది. ఇక సుంకాలను రద్దు చేసినప్పటికీ.. అక్టోబర్ 14 వరకు మాత్రం కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: GAMA Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రంగా పుష్ప 2

భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఆసియాలో భారత్‌పైనే మాత్రమే 50 శాతం సుంకం విధించారు. చైనా మీద మాత్రం ప్రేమ చూపించారు. చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనా మీద మాత్రం విధించలేదు.

Exit mobile version