Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్
- సౌదీ యువరాజుపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు
- ఇరాన్‌తో యుద్ధానికి గల్ఫ్ దేశాలు సహకరిస్తున్నాయని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. ‘‘అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను అనుకోలేదు.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
- PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను 'ప్రధాని' చేస్తాడా?
- Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
ఫ్లోరిడాలో జరిగిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాతో కలిసి గల్ఫ్ దేశాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సౌదీ యువరాజుపై చురకలు అంటించారు. ‘‘ఇలా జరుగుతుందని అతను అనుకోలేదు… అతను నా కాళ్ళకు నమస్కరించాల్సి వస్తుందని ఊహించలేదు… మరో సాధారణ అమెరికా అధ్యక్షుడిలా ఉంటాననుకున్నాడు.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
అలా సౌదీ యువరాజును విమర్శించిన వెంటనే ట్రంప్ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ‘‘అద్భుతమైన వ్యక్తి’’, ‘‘యోధుడు”గా అభివర్ణించారు. సౌదీ అరేబియా ప్రజలు అతన్ని చూసి గర్వపడవచ్చని పొగడ్తలతో ముంచెత్తారు. క్షణాల్లోనే ట్రంప్ తన మాటలను మార్చేశారు.
ఇది కూడా చదవండి: Trump: ఓడిపోయినోళ్లతో తిరగడమే ఇష్టం.. ప్రశ్నోత్తరాల్లో ట్రంప్ కీలక సంభాషణ
ఇదిలా ఉంటే ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మహమ్మద్ బిన్ సల్మాన్ గోప్యంగా ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతూ ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలని సూచించినట్లుగా నివేదికలో పేర్కొంది. దీనిని “చారిత్రాత్మక అవకాశం”గా పేర్కొన్నట్లు తన కథనంలో తెలిపింది. అయితే ఈ ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. తాము శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది.
Trump: Saudi ruler 'KISSING MY ASS' pic.twitter.com/5DhtmWBUmv
— RT (@RT_com) March 28, 2026
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!