Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్‌పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్
- హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్‌పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు
- త్వరలోనే చైనాకు వెళ్తున్నట్లు ప్రకటన
- జిన్‌పింగ్‌ను కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్న వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలా సంతోషంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తెరుచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం లేదా త్వరలో పూర్తిగా అందుబాటులోకి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. చైనాలో జరగబోయే తమ సమావేశం ప్రత్యేకంగా.. చారిత్రాత్మకంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలుసుకునేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఈ సమావేశంతో చాలా విషయాలు సాధ్యమవుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
ఇది కూడా చదవండి: Mamata Banerjee: మమత ర్యాలీలో యువకుడు దుశ్చర్య.. హడలెత్తిపోయిన ముఖ్యమంత్రి
అధ్యక్షుడు ట్రంప్ మే నెలలో చైనాలో పర్యటించనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దక్షిణాసియాకు రావడం ఇదే తొలిసారి. చైనాతో పాటు పాకిస్థాన్‌లో కూడా పర్యటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరితే సంతకాలు చేసేందుకు పాకిస్థాన్‌లో కూడా పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఫిబ్రవరి 28న ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ సహా పలు కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు తలెత్తాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం సోమవారంతో ముగుస్తోంది.
ఇదిలా ఉంటే శాంతి ఒప్పందం కోసం గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. 21 గంటల తర్వాత చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం మరోసారి చర్చల కోసం సోమవారం తిరిగి పాకిస్థాన్‌లో కలవనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.

తాజావార్తలు
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!