US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన యూఎస్..
- వెనిజులాపై అమెరికా భారీ దాడులు..
- అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య నిర్బంధం..
- అమెరికాకు తరలించినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Venezuela War: అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులతో విరుచుపడుతోంది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా దాడులు చేసింది. ఈ ఘర్షణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను పట్టుకున్నట్లు ప్రకటించాడు. వెనిజులా నుంచి అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది.
వెనిజులా రాజధాని కారాకస్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అమెరికా దాడులు నిర్వహించింది. పేలుళ్ల తర్వాత భవనాలు మంటల్లో చిక్కుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ దాడులు నిర్వహించిట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా మాట్లాడుతూ.. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురో మరియు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం బయటకు తరలించినట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.
Also Read
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Pakistan: పాక్‌లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
Read Also: US Venezuela Conflict: వెనిజులాపై బాంబులతో విరుచుకుపడిన అమెరికా..
అమెరికా చర్యలను వెనిజుల ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమత్వంపై దాడి అని పేర్కొంది. దేశంలోని చమురు, ఖనిజ సంపదను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా దాడులు చేసినట్లు ఆరోపించింది. దాడుల తర్వాత వెనిజులా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ దాడులను ఇరాన్ సహా పలు అమెరికా వ్యతిరేక దేశాలు ఖండించాయి. కొలంబియా తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఐక్యరాజ్యసమితి, అమెరికన్ స్టేట్స్ ఆర్గనైజేషన్ (OAS) తక్షణమే సమావేశం కావాలని కొలంబియా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
-
SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..
-
Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!