Site icon NTV Telugu

Trump Tariff: ట్రంప్ మొండివైఖరి.. భారత్‌తో చర్చలకు..!

Trump

Trump

భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. సుంకాలు కారణంగా ఆ బంధానికి బీటలు పడ్డాయి. కొత్తగా రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగించడం ట్రంప్‌కు ఏ మాత్రం రుచించడం లేదు. ఈ నేపథ్యంలో బంధాలు మరింత దిగజారిపోయాయి.

ఇది కూడా చదవండి: Radhika Apte : గర్భవతిని అని చెప్పిన వినకుండా.. ఆ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టారు

తాజాగా సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యేంత వరకు భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ తేల్చి చెప్పారు. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో తిరిగి ఇరు దేశాల మధ్య జరుగుతాయా? అని ఓవల్ ఆఫీసులో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ పై విధంగా స్పందించారు.

ఇది కూడా చదవండి: Rashmika Mandanna: నా ఎమెషన్స్‌ను దాచుకోడానికి కారణం ఇదే..

ఇక ట్రంప్ టారిఫ్‌లపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. బెదిరింపులకు భారత్ భయపడదని.. టారిఫ్‌లు భరించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మోడీ తేల్చి చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. భారీ మూల్యం చెల్లించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.

భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ అయింది. మొదటి 25 శాతం సుంకం ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా.. రెండో సుంకం మాత్రం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. కేవలం 21 రోజుల గడువు మాత్రమే ట్రంప్ ఇచ్చారు.

 

Exit mobile version