Site icon NTV Telugu

Trump: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జరగబోతుంది.. ట్రంప్ కీలక ప్రకటన

Trump

Trump

భారత దేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. వైట్ హౌస్‌లో జరిగిన ‘‘బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్’’లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాతో కీలక ఒప్పందం జరిగిందని.. త్వరలోనే భారతదేశంతో కూడా చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతుందని సూచనప్రాయంగా ట్రంప్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్‌కేకుల్లా మ్యాచ్‌ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు

రెండు దేశాల బృందాలు నాలుగు రోజుల పాటు రహస్య చర్చలు జరిగాయని.. త్వరలోనే ప్రకటన రాబోతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని.. దానిలో భాగం కావాలని కోరుకుంటారని.. కానీ మేము ప్రతి దేశంతో ఒప్పందాలు చేసుకోమని ట్రంప్ తేల్చి చెప్పారు. కొంత మందికి చాలా ధన్యవాదాలు చెబుతూ లేఖలు కూడా పంపినట్లు చెప్పుకొచ్చారు. కొన్ని నెలల క్రితం పత్రికలు రకరకాలుగా రాశాయని.. మీతో ఒప్పందాలు చేసుకోవడానికి ఎవరైనా  ఉన్నారా? అని ప్రశ్నించాయని.. కానీ నిన్ననే మేము చైనాతో సంతకం చేసినట్లు గుర్తుచేశారు. మాకు కొన్ని గొప్ప ఒప్పందాలు ఉన్నాయని.. త్వరలో ఒకటి రాబోతుందని.. బహుశా భారతదేశంతో అది చాలా పెద్దది అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Minister Satya Prasad: వారిపై కఠిన చర్యలు తప్పవు.. నకిలీ ఈ-స్టాంపులపై మంత్రి సీరియస్‌..!

మెగా వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా మధ్య నాలుగు రోజుల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. రెండు దేశాల్లో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్, సుంకాల కోతలు, నాన్-టారిఫ్ అడ్డంకులపై దష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రతినిధి బృందానికి అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారులు నాయకత్వం వహించగా.. భారత బృందానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహించారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ల నుంచి 2023 నాటికి 500 బిలియన్లకు తీసుకెళ్లేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

జూన్ 10న ఇరు దేశాల చర్చలు ముగిసిన సందర్భంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే న్యాయమైన, సమానమైన వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపినట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రధాని మోడీ-ట్రంప్ 2025లో సమావేశం అయ్యారని.. ఇద్దరూ కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలకు, వ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈనెల ప్రారంభంలో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావొచ్చన్నారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం ఉమ్మడి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

 

Exit mobile version