Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..

  • నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
  • నా నిర్ణయాలే ఆ దేశాన్ని కాపాడాయి..
  • నెతన్యాహూ నన్ను గౌరవిస్తారు..
  • ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Trump Netanyahu

Trump Netanyahu

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూకు తనకు మధ్య బలమైన బంధం ఉందని చెబుతూనే, ఆయనను ‘‘అదుపులో’’ ఉంచాల్సి వస్తోందని అన్నారు. ఆక్సియోస్ జర్నలిస్టూ మార్క్ కపుటోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలపై ఇజ్రాయిల్ దాడి చేయకుండా తాను ఆపగలనని అన్నారు. నెతన్యాహూ తనను చాలా గౌరవిస్తారని, తాను చెప్పినట్లు చేస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇటీవల జరిగిన ఇరాన్ యుద్ధంలో తాను ఇజ్రాయిల్‌కు భద్రత కల్పించానని ట్రంప్ చెప్పారు. 2015లో ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడంలో మతాను కీలక పాత్ర పోషించినట్లు, తద్వారా ఒక పెద్ద ముప్పును తప్పించానని ట్రంప్ అన్నారు. తాను లేకపోతే ఇజ్రాయిల్ నాశనమై ఉండేదని చెప్పారు. తాను ఆ నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే ఇజ్రాయిల్ ఈ రోజు ఉండేది కాదని అన్నారు.

×
×
Ad