ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బరువు తగ్గించే మందుల ధరలకు సంబంధించిన కొత్త ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మోడీతో చర్చలు బాగా జరుగుతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Vande Mataram: నేడు “వందేమాతరం” 150 వ వార్షికోత్సవాలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం చాలా మట్టుకు భారత్ మానేసిందని తెలిపారు. మోడీ మంచి స్నేహితుడు.. మేము మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పారు. భారత్‌కు రావాలని కోరుతున్నారని.. కచ్చితంగా భారత్‌కు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘అవును.. అలా కావచ్చు’’ అని ట్రంప్ బదులిచ్చారు.
ఇది కూడా చదవండి: Droupadi Murmu : ఈనెల 20న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ ఏడాది చివరిలో భారత్‌లో క్వాడ్ సమ్మిట్ (Quad Summit) జరగనుంది. ఇందులో యునైటెడ్ స్టేట్స్, జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే వాణిజ్య యుద్ధం కారణంగా భారత్‌లో జరిగే క్వాడ్ సమ్మిట్‌కు ట్రంప్ భారతదేశాన్ని సందర్శించే ఉద్దేశం లేదని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ఆగస్టులో పేర్కొంది. కానీ ఇంతలోనే ట్రంప్‌లో మార్పు కనిపిస్తోంది. మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయని.. కచ్చితంగా భారత్‌ను సందర్శిస్తానని గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు.
వాస్తవంగా ట్రంప్ మొదటి పాలన కాలంలో మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించగా.. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. అన్ని దేశాల కంటే భారత్‌పైనే ఎక్కువగా ట్రంప్ సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం పూర్తిగా దెబ్బతింది. ఇదిలా ఉంటే ఇటీవల ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటనలో ఉండగా మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.