ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
అందమైన యువతి అని పిలిస్తే అభ్యంతరం లేదు కదా? అని మెలోనిని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని సహా వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈజిప్టు వేదికగా సోమవారం గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
ప్రధాని మోడీని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా ప్రపంచ అగ్ర నాయకులంతా ఒక చోట నిలబడి ఉండగా.. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కనే ఉండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈజిప్టులో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
భారత ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాణిజ్య సుంకాలపై చర్చలు జరిగాయి. అయితే శుక్రవారం ఇదే అంశంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు.