Site icon NTV Telugu

Trump: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగలం.. మరోసారి ట్రంప్ అణు ప్రస్తావన

Trump2

Trump2

ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల సామర్థ్యం అమెరికా దగ్గర ఉందని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూనే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అమెరికా సొంతం అని పునరావృతం చేశారు. అణు సామర్థ్యాల్లో అమెరికాలో మొదటి స్థానంలో ఉంటుందని.. రష్యా, చైనా తర్వాత స్థానాల్లో ఉంటాయని చెప్పారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయం అని అనుకుంటున్నా.. ఇదే విషయంపై ఇప్పటికే పుతిన్, జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ అణ్వాయుధాలకు ఖర్చు పెట్టే డబ్బుంతా ఇతర విషయాలపై ఖర్చు చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తాను శాంతిని కోరుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Supreme Court: పైలట్లను నిందించొద్దు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక సూచన

ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. త్వరలో అమెరికా కూడా అణు పరీక్షలు చేయబోతుందని తెలిపారు. ఇతర దేశాలు చేస్తున్నప్పుడు.. తామెందుకు చేయకూడదన్నారు. పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందని స్పష్టం చేశారు. తాము బహిరంగంగా చేస్తాం.. రష్యా, చైనా రహస్యంగా చేస్తాయన్నారు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల సామర్థ్యం అమెరికాకు ఉందన్నారు. అయినా ఆ రెండు దేశాల్లో ప్రశ్నించే దమ్ము విలేకర్లకు ఉంటుందా? అని ప్రశ్నించారు. తాజాగా అదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘‘ఓట్ చోరీ’’పై ఈసీ ఇప్పటిదాకా స్పందించలేదు.. మరిన్ని ఆధారాలు ఉన్నాయన్న రాహుల్‌గాంధీ

 

Exit mobile version