ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన వారిని ఎవరూ మరిచిపోరని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం వర్జీనియాలోని నార్ఫోక్లో అమెరికా నావికాదళం 250వ ఉత్సవాలు సందర్భంగా జరిగిన ప్రత్యేక వేడుకలో ట్రంప్ ప్రసంగించారు. లాడెన్ తలలో బుల్లెట్లు దింపిన నేవీ సీల్స్‌ను చరిత్ర ఎప్పటికీ మరిచిపోదని.. ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని ట్రంప్ ప్రశంసించారు. 9/11 దాడికి ఒక సంవత్సరం ముందే లాడెన్ అంతు చూడాలని అధికారులకు సూచించినట్లు గుర్తుచేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదని.. సంవత్సరం తర్వాత అతడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశాడని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్
2001లో ఒసామా బిన్ లాడెన్ అమెరికా విమానాలను హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశాడు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనంతరం ఒబామా హయాంలో బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు వెంటాడి చంపేశాయి. 2011, మే 2న యూఎస్ నేవీ సీల్స్ బిన్ లాడెన్‌ను చంపేందుకు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్‌ను నిర్వహించాయి. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లోని రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. నిఘా సంస్థలు కరుడు గట్టిన అల్-ఖైదా ఉగ్రవాది లాడెన్ జాడను గుర్తించి ఆపరేషన్ ప్రారంభించాయి. క్షణాల వ్యవధిలోనే లాడెన్ తలలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అతనితో పాటు నలుగురు అక్కడికక్కడే హతమయ్యారు. అనంతరం లాడెన్ శవాన్ని సముద్రంలో పడేశారు. మొత్తానికి దశాబ్ద కాలం తర్వాత లాడెెన్ను అమెరికా దళాలు అంతుచూశాయి.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్‌లో మేనేజర్ ఏం చేశాడంటే..!
బిన్ లాడెన్ సౌదీలో జన్మించాడు. ఉన్నత విద్యను అభ్యసించి కరుడు గట్టిన ఉగ్రవాదిగా మారాడు. అల్ ఖైదాను స్థాపించి అనేక దేశాల్లో మారణహోమం సృష్టించాడు. 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌ను పేల్చేశాడు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం డిసెంబర్ 2001లో పాకిస్థాన్‌కు పారిపోయాడు. ఇక అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా సూచన మేరకు 2011, మే నెలలో అమెరికా దళాలు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ నిర్వహించి లాడెన్ హతమార్చాయి. పాకిస్థాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1 ఒంటి గంట ప్రాంతంలో హతమయ్యాడు. అనంతరం శవాన్ని ఆప్ఘనిస్థాన్‌కు తీసుకొచ్చి అరేబియా సముద్రంలో వదిలేశారు. ఈ ఆపరేషన్‌ను ఒబామా వైట్‌హౌస్ నుంచి వీక్షించారు. మే 6, 2011లో లాడెన్ మరణాన్ని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు ధృవీకరించాయి.