Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట
- భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా
- ట్రంప్ నోట మళ్లీ అదే మాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం అనేక మార్లు ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చల కారణంగానే కాల్పుల విరమణ జరిగిందని.. ఇందుకు మూడో వ్యక్తి ప్రమేయం ఏ మాత్రం లేదని భారత్ అనేక మార్లు మీడియా సముఖంగా ప్రకటించింది. కానీ తాజాగా శుక్రవారం రిపబ్లికన్ శాసనసభ్యులతో జరిగిన ఒక ప్రైవేట్ విందులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనట్లుగా వెల్లడించారు. వాణిజ్యం ద్వారానే ఇరు దేశాల మధ్య సమస్యను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నాలుగు రోజులు యుద్ధంలో ఐదు జెట్‌లు కూలిపోయాయని చెప్పారు. ఎక్కడా? ఏంటి? అనేది మాత్రం వెల్లడించలేదు.
ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్‌హౌస్‌కు వచ్చి నోబెల్ శాంతి బహుమతికి తనకు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. భారత్-పాకిస్థాన్ రెండు దేశాలు అణు దేశాలే.. మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకే యుద్ధాన్ని అడ్డుకున్నట్లు చెప్పారు.
Also Read
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
- Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: ఊహాగానాలు వద్దు.. మీడియా కథనాలను తోసిపుచ్చిన అమెరికా దర్యాప్తు సంస్థ
నోబెల్ శాంతి బహుమతి పొందాలని ట్రంప్ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఏం జరిగినా దానికి క్రెడిట్ ట్రంప్ తీసుకుంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య, హమాస్-ఇజ్రాయెల్ మధ్య, రష్యా-ఉక్రెయిన్ మధ్య, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించినట్లుగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఇక ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి ఇప్పటికే పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు మద్దతు తెలిపాయి.
ఇది కూడా చదవండి: UP: యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం.. డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.
#WATCH | Washington, D.C.: US President Donald Trump says, "We stopped a lot of wars. And these were serious, India and Pakistan, that was going on. Planes were being shot out of there. I think five jets were shot down, actually. These are two serious nuclear countries, and they… pic.twitter.com/MCFhW406cT
— ANI (@ANI) July 18, 2025
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!