రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు భారీ జరిమానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇందలో భాగంగానే భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇదే కోవలో చైనా కూడా ఉంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ చాలా దగ్గరగా ఉందని ట్రంప్ తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు.