Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు
- ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- మళ్లీ తీవ్రమవుతోన్న ఉద్రిక్తతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఉద్రిక్తతలు తగ్గుతాయని అనుకుంటే.. అనూహ్యంగా మళ్లీ పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా అమెరికా దాడులు చేయడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.
తాజాగా ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మధ్యప్రాచ్య రౌడీ ఇక చనిపోయాడు” అంటూ ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య తాజా సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయిందని.. వారి నౌకాదళం, వైమానిక దళ సామర్థ్యాలు దాదాపు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో టెహ్రాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ఆరోపిస్తూ.. ఇప్పుడు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
- Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
- Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
- Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
“ఇరాన్ సైన్యం పూర్తిగా గందరగోళంలో ఉంది. వారు పూర్తిగా ఓడిపోయారు. ఇరాన్ మాటలు మాత్రమే చెబుతుంది.. చర్యలు ఉండవు. మధ్యప్రాచ్య రౌడీ ఇక చనిపోయాడు” అని ట్రంప్ తన పోస్టులో వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఇరాన్‌పై ట్రంప్ చేసిన అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.
కొన్ని గంటల ముందే ఇరాన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికాతో ప్రయోజనకరమైన ఒప్పందం చేసుకునే అవకాశాన్ని ఇరాన్ కోల్పోయిందని.. చర్చలు జరపడంలో చాలా ఆలస్యం చేసిందని అన్నారు. “వారికి ఎంతో ఉపయోగపడే ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించాల్సిందే” అని హెచ్చరించారు. ఇటీవల అమెరికా.. ఇరాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు నిర్వహించగా.. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలో ఉన్న అమెరికా సైనిక కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

- Tags
- Iran
- Middle East
- trump
- us
తాజావార్తలు
-
Vikalp Tiwari: టీ20ల్లో మరో యువ సంచలనం.. రెండో భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
స్నాప్‌చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!
-
Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
-
Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!
-
OnePlus Turbo 7 Pro 5G: 10,000mAh బ్యాటరీతో OnePlus కొత్త 5G ఫోన్.. 200MP కెమెరా, 100W ఛార్జింగ్!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..